మనసు యాతమై ఆనాటి
జ్ఞాపకాలను తోడి పోస్తుంది..
అనుభూతులు కదం తొక్కుతూ
కళ్ళముందాడుతున్నాయి..
ఆ రోజు నను వీడి పోతూ..
వీధి మలుపు దగ్గర మసక వెలుతురులో
నువ్వు కలిసి పోతున్నప్పుడు..
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు !
తిరిగి బ్రతుకు తున్నాయి.
మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని ఆ రెండు చుక్కలు !!
నేటికీ ఉన్నట్టున్నాయి .
ఎందుకో ఈ రోజు నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు మూర్కొని కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది..
ఆ రోజు నను వీడి పోతూ..
వీధి మలుపు దగ్గర మసక వెలుతురులో
నువ్వు కలిసి పోతున్నప్పుడు..
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు !
తిరిగి బ్రతుకు తున్నాయి.
మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని ఆ రెండు చుక్కలు !!
నేటికీ ఉన్నట్టున్నాయి .
ఎందుకో ఈ రోజు నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు మూర్కొని కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది..
"మనసు యాతమై ఆనాటి
ReplyDeleteజ్ఞాపకాలను తోడి పోస్తుంది.."
ఈ లైను చాలా బావుంది
‘భావాలు బ్రతుకు తున్నాయి’ నిజంగా చదువుతుంటే మాలోనూ గతాలు పుట్టుకొస్తున్నాయి. ఆలొచనలు చాలా బావున్నాయి.
ReplyDeleteఆత్రేయ గారూ !హృదయం భారమై , చూపు మరలక ,మీ కవిత లోని ప్రతి అక్షరాన్ని గుండెలో నిక్షిప్తం చేస్తోంది .చాలా బావుందండీ .
ReplyDeleteఆత్రేయ గారూ ....Thanks andi... and me Kavithalu bagunayye...
ReplyDeletechalaa bagundu,
ReplyDeleteuppaa gaa tagili uppogina baavalu,yeppu ralaayo
teliyadu remdu chukkalu,inkudu guntaaa nimdi
manchi feel tho rasaru.
super.
"గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ReplyDeleteఇవాళ అదీ నిండి నట్టుంది"
భాధని కూడా ఇంత బాగా చెప్పడం మీకే సాద్యం!!!
గురువు గారూ,
ReplyDeleteనా గొంతులో రూపం దాల్చలేని భావాలు, మదిలోని ఊసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయేమో కదా? నిరాశ పరచకూడదని మీరొక రూపాన్నిచ్చారేమో, అదంగా ముస్తాబైన స్మృతులు అబ్బురంగా కనిపిస్తున్నాయి.
నిజంగా.
"యాతమేసి తోడినా ఏరుఎండదూ, పొగిలి పొగిలి ఏడ్చినా పుంత నిండదు" పాట గుర్తుకొచ్చింది. నాకూ అంతే, రెండు కళ్ళ చెలమల్లో మాత్రం నిత్యం నీరు ఇనకక వూటబావిలా వూరుతుంది, వొళ్ళంతా ఎండుతుమ్మముళ్ళమాదిరి పొడిబారిపోయినా.
ReplyDeleteకొత్తపాళీ గారు, పృధ్వీ గారు, పరిమళం గారు ధన్యవాదాలు.
ReplyDeleteఒక్కనిమిషం గారు నా బ్లాగుకి స్వాగతమండీ.
అనానిమస్ గారు పద్మార్పిత గారు ధన్యవాదాలు.
శృతి, ముస్తాబయిన స్మృతి గులాబీలను ఆఘ్రాణించాలంటే, ముళ్ళకొమ్మని ఆత్మీయతతో అక్కున చేర్చుకోవాల్సిందే, ఆ ఆనందం కళ్ళలో సుడులు తిరగాల్సిందే. కదా ?
ఉష గారు బాగా చెప్పారు. మరింకే కలంతో తోడి కాగితాలు నింపండి.