Tuesday, September 16, 2008
అందని ఫలం !!
బురదలో పుట్టిన పద్మానికి
కొలనులో విరిశిన కలువలకి
కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళకి
మట్టిలో పుట్టిన మాణిక్యానికి
గుడిలో వెలిసిన కొండరాతికి
గుండెలో ఒదిగిన నీకు
పోలికేమిటని చూస్తున్నావా?
వాటివిలువ వాటికి తెలియదు
నీకా విలువ లేదని చెప్పకు
నువ్వు నాకు అమూల్యం అతుల్యం
అస్పృశ్యం అలభ్యం .. అందని ఫలం !!
buradalO puTTina padmaaniki
kolanulO viriSina kaluvalaki
kaLLallO tirigina kanneeLLaki
maTTilO puTTina maaNikyaaniki
guDilO velisina konDaraatiki
gunDelO odigina neeku
pOlikEmiTani cuustunnaavaa?
vaaTiviluva vaaTiki teliyadu
neekaa viluva lEdani ceppaku
nuvvu naaku amuulyam atulyam
aspRSyam alabhyam .. andani phalam !!
మామూలు మనిషి
గుండెలు తోడి వాడి గోళ్ళతో నొక్కినా
మృదువుగా మ్రోగగల వీణను కాను
మనసును తొలిచి వేడి దబ్బనాలు గుచ్చినా
అందంగా పాడగల వేణువు కాను
తోలు వొలిచి కసిగా కాల్చి కట్టినా
పాటకు ప్రాణమిచ్చే తప్పెట కాను
చిన్న విషయాలకు ఆనంద పడుతూ
ఉన్న ప్రేమను బయట పెడుతూ
చేజారిన దాని కోసం బాధ పడుతూ
అందని దానికై ఆరాటపడుతూ
అందిన వాడిపై ఈర్ష్య పడుతూ
బ్రతుకు నడిపే మనిషిని
మామూలు మనిషిని
నేను మామూలు మనిషిని !!
gunDelu tODi vaaDi gOLLatO nokkinaa
mRduvugaa mrOgagala veeNanu kaanu
manasunu tolici vEDi dabbanaalu guccinaa
andangaa paaDagala vENuvu kaanu
tOlu volici kasigaa kaalci kaTTinaa
paaTaku praaNamiccE tappeTa kaanu
cinna vishayaalaku aananda paDutuu
unna prEmanu bayaTa peDutuu
cEjaarina daani kOsam baadha paDutuu
andani daanikai aaraaTapaDutuu
andina vaaDipai eershya paDutuu
bratuku naDipE manishini
maamuulu manishini
nEnu maamuulu manishini !!
ఏ మయ్యింది ?
భాషగ మారిన భావం
వ్యక్తపరిచీ వ్యర్ధమయ్యింది
అరిచి అలసిన మనసు
మిన్నకుంది, మూగదయ్యింది
తలపుల్లో మెరిసిన నాకళ్ళు
కలలు కరిగి శుద్ధమయ్యాయి
పెదవిపై ఉండాల్సిన నా నవ్వు
లోనికి జారింది, గుండె బరువయ్యింది
ఎంత కాలానికో కంట నీరు నిండింది
లోన మంట మొదలయ్యింది !!
bhaashaga maarina bhaavam
vyaktaparicee vyardhamayyindi
arici alasina manasu
minnakundi, muugadayyindi
talapullO merisina naakaLLu
kalalu karigi Suddhamayyaayi
pedavipai unDaalsina naa navvu
lOniki jaarindi, gunDe baruvayyindi
enta kaalaanikO kanTa neeru ninDindi
lOna manTa modalayyindi !!
Subscribe to:
Posts (Atom)