Thursday, September 25, 2008
తృప్తి
అమ్మవైనా బాగుండేది
పాపగా నీ ఒళ్ళో ఆడేవాడిని
ప్రణవమై నీ అక్కున చేరేవాడిని
నేను నీవాడినన్న తృప్తుండేది
చెల్లి వైనా బాగుండేది
చెట్టపట్టలేసుకుని తిరిగేవాడిని
చిన్నతనాన్ని పంచేవాడిని
నువ్వు నాదానివన్న తృప్తుండేది
ప్రేయసివైనా బాగుండేది
నా ప్రాణము నువ్వుగ బ్రతికేవాడిని
ప్రళయం దాకా తోడుండేవాడిని
మనమొకటేనన్న తృప్తుండేది
నే మెచ్చిన చెలివై పోయావ్*,
దగ్గరేవున్నా మధ్యన దూరాలెక్కువ
మన మాటల్తో వాటిని చెరిపేద్దామా?
బందీ చెయ్యని బంధాలెక్కువ
మన చూపుల్తో వాటిని తెంపేద్దామా ?
విధి మన మధ్యన లోయలు తవ్వింది
మన స్నేహంతో వాటిని పూడ్చేదామా ?
అప్పటికైనా ఇప్పుడులేని తృప్తి తిరిగొస్తుందేమో !!
ammavainaa baagunDEdi
paapagaa nee oLLO aaDEvaaDini
praNavamai nee akkuna cErEvaaDini
nEnu neevaaDinanna tRptunDEdi
celli vainaa baagunDEdi
ceTTapaTTalEsukuni tirigEvaaDini
cinnatanaanni pancEvaaDini
nuvvu naadaanivanna tRptunDEdi
prEyasivainaa baagunDEdi
naa praaNamu nuvvuga bratikEvaaDini
praLayam daakaa tODunDEvaaDini
manamokaTEnanna tRptunDEdi
nE meccina celivai pOyaav,
daggarEvunnaa madhyana duuraalekkuva
mana maaTaltO vaaTini ceripEddaamaa?
bandee ceyyani bandhaalekkuva
mana cuupultO vaaTini tempEddaamaa ?
vidhi mana madhyana lOyalu tavvindi
mana snEhamtO vaaTini pooDcEdaamaa ?
appaTikainaa ippuDulEni tRpti tirigostundEmO !!
నీ చిత్రం
కైలాస గిరి నందు
కదలాడు హిమ దనము
కినుక బూనె నేమొ మాయమయ్యి
చెలియ చూపు లోన నిలిచె నేడు
జలధి లోతులోన
జన్మించు ముత్యాలు
తగిన స్థలము కొరకు వెదికి వెదికి
చెలియ నవ్వులోన దొర్లె నేడు
గాయత్రి మంత్రాల
ఒలుకు శాంతి నేడు
ఇరుకు మంత్రాల స్థలము చాలకేమో
చెలియ ముఖములోన తాండవించె
అడవుల్లొ తిరిగేటి
హిరణుల్లో కనిపించు
చంచలత్వము నేడు పారిపోయి
చెలియ ముంగురులలోన వచ్చే చూడు
మనసునలజడి రేపు
నీ దివ్య రూప మిపుడు
చిత్రమై నా చేత చేరినపుడు,
వింత కవితలు నాకు తోచె చెలియా!!
kailaasa giri nandu
kadalaaDu hima danamu
kinuka buune nEmo maayamayyi
celiya cuupu lOna nilice nEDu
jaladhi lOtulOna
janmincu mutyaalu
tagina sthalamu koraku vediki vediki
celiya navvulOna dorle nEDu
gaayatri mantraala
oluku Saanti nEDu
iruku mantraala sthalamu caalakEmO
celiya mukhamulOna taanDavince
aDavullo tirigETi
hiraNullO kanipincu
cancalatvamu nEDu paaripOyi
celiya mungurulalOna vaccE cuuDu
manasunalajaDi rEpu
nee divya ruupa mipuDu
citramai naa cEta cEri celiyaa,
vinta kavitalu naaku tOcucunDE !!
శాంతి పత్రం
చల్లని నీ నవ్వును
పదిలంగా తనలోనే పొదివి పట్టి
చక్కని నీ మొమును
అందంగా గుండెల్లో దాచి పెట్టి
నీ నిలువెత్తు రూపాన్ని
తనలోనే ఆత్రంగా ఇముడ్చుకున్న
ఆ చిత్రం ధన్యం సఖీ !!
అడగగానే లేదనక
ఆప్యాయంగా అందిస్తూ
కలలనుండి నీ రూపును
కనుల ఎదుట నిలుపుతూ
స్వార్ధం ఒకింతలేక
నీ రూపును లాలనకై నాకిచ్చిన
ఆ చిత్రం ధన్యం చెలీ !!
నీ చిత్రమా అది ?
కాదు కాదు
నా మనసుకు నువ్విచ్చిన
శాంతి పత్రం !!
callani nee navvunu
padilangaa tanalOnE podivi paTTi
cakkani nee momunu
andamgaa gunDellO daaci peTTi
nee niluvettu ruupaanni
tanalOnE aatramgaa imuDcukunna
aa citram dhanyam sakhee !!
aDagagaanE lEdanaka
aapyaayangaa andistuu
kalalanunDi nee ruupunu
kanula eduTa niluputuu
swaardham okintalEka
nee ruupunu laalanakai naakiccina
aa citram dhanyam celee !!
nee citramaa adi ?
kaadu kaadu
naa manasuku nuvviccina
Saanti patram !!
Subscribe to:
Posts (Atom)