Tuesday, October 21, 2008

మా ఇంట్లో చెట్లు

నునులేత ఆకులతొ తొలివాన చినుక్కుల్లో
తడిసి ఆరిన తనువులతో స్వచ్చమయ్యేవి
ఆకు పచ్చని రంగు ఆసాంతము తొడిగేసి
పడుచు ప్రేయసి లాగ పలకరించేవి

బోసి నవ్వులలాగ పూలెన్నొ విరబూసి
మనసుల్ని హాయిలో ఊపివేసేవి
సంధ్య రంగులు ఎన్నొ అరువడిగి తెచ్చేసి
పెద్ద ముత్తయిదువల్లె ఎదురు వచ్చేవి

రెక్కలొచ్చిన గుడ్డు తనదారిగొన్నాట్టు
పెళ్ళిచేసిన బిడ్డ అత్తిల్లు జనినట్లు
ఎండినాకులు నేడు రాలుతున్నాయి
వివశులై ఆ చెట్లు మానులౌతున్నాయి

నగ్నంగ నిలుచుండి తపియించె మునిలాగ
వసంతమెపుడని నేడు ఎదురుచూస్తున్నాయి
తమ బాధ నాతోటి చెప్పుకుంటున్నాయి
నా గుండె మెత్తగా కోత కోస్తున్నాయి !!

nunulEta aakulato tolivaana cinukkullO
taDisi aarina tanuvulatO swaccamayyEvi
aaku paccani rangu aasaantamu toDigEsi
paDucu prEyasi laaga palakarincEvi

bOsi navvulalaaga poolenno virabuusi
manasulni haayilO uupivEsEvi
sandhya rangulu enno aruvaDigi teccEsi
pedda muttayiduvalle eduru vaccEvi

rekkaloccina guDDu tanadaarigonnaaTTu
peLLicEsina biDDa attillu janinaTlu
enDinaakulu nEDu raalutunnaayi
vivaSulai aa ceTlu maanuloutunnaayi

nagnamga nilucunDi tapiyince munilaaga
vasantamepuDani nEDu edurucuustunnayi
tama baadha naatOTi ceppukunTunnaayi
naa gunDe mettagaa kOta kOstunnaayi

నాదైన సొత్తు

నా రాతలా నీకు అర్ధాలు కావు
నన్నడిగి నా భావమెరుగనూ రావు
నీకొచ్చిన అర్ధాలు తేసేసుకుంటూ
అలిగి నీ మనసు నొప్పించుకుంటూ
తప్పు తలపై నాకు రుద్దకమ్మా
నా భావమేదీ నీ తప్పు లెతకదు
నా మాటఏదీ నిన్నొప్పించ చూడదు
నా కవితఏదీ నిను నొప్పింప జాలదు
నువ్వలిగి మౌనాన్ని చేపట్టవచ్చు
కసిరేసి నా శాంతి విరచనూ వచ్చు
నీ ఇచ్చమొచ్చిన రీతి వర్తించవచ్చు
ఆ మౌనంతో నా ఊపిరాగిందని ఎరుగు
బాధ తంతృలనది మీటిందని ఎరుగు
నా భావ మూలాలు నీదగ్గరున్నా
అంత్య పరిణామాలు నాదైన సొత్తే !!


naa raatalaa neeku ardhaalu kaavu
nannaDigi naa bhaavameruganuu raavu
neekoccina ardhaalu tEsEsukunTuu
aligi nee manasu noppincukunTuu
tappu talapai naaku ruddakammaa
naa bhaavamEdee nee tappu letakadu
naa maaTaEdee ninnoppinca cuuDadu
naa kavitaEdee ninu noppimpa jaaladu
nuvvaligi mounaanni cEpaTTavaccu
kasirEsi naa Saanti viracanuu vaccu
nee iccamoccina reeti vartincavaccu
aa mounamtO naa uupiraagindani erugu
baadha tantRlanadi meeTindani erugu
naa bhaava muulaalu needaggarunnaa
antya pariNaamaalu naadaina sottE !!

మమకారం

నకారాల కవిత నప్పింది కాబోలు
మమకార మీరోజు గుప్పించుతుంది
న నో ల అర్జీలు నచ్చాయి కాబోలు
ఈరోజు మాటల్లో ముంచెత్తుతుంది
నా భావమిన్నాళ్ళకందింది కాబోలు
తనతోటి నా నడకనందించ మంది
అనిపించి ఆ మాటలన్నాను గానీ
నొప్పించి నీ తోడు పొందాలనిగాదు
కవితలో భావాలు ఏమైనా గానీ
నీకు నచ్చని పనులేవి నాకోసమైనా
చెయ్యకున్నా నాకు చెల్లునే చపలా !!


nakaaraala kavita nappindi kaabOlu
mamakaara meerOju guppincutundi
na nO la arjeelu naccaayi kaabOlu
eerOju maaTallO muncettutundi
naa bhaavaminnaaLLakandindi kaabOlu
tanatOTi naa naDakanandinca mandi
anipinci aa maaTalannaanu gaanee
noppinci nee tODu pondaalanigaadu
kavitalO bhaavaalu Emainaa gaanee
neeku naccani panulEvi naakOsamainaa
ceyyakunnaa naaku cellunE capalaa !!