వయసు కేంద్రం..
భవిత ఇంధనం...
జ్ఞాపకాల తరుగు..
ఆశల వాలు..
బంధాల మోత..
అనుభవపు మిగులు..
బాధ కుదుపులు..
విధి పధం..
బ్రతుకు చక్రం..
పయనం !
జారిపోతూ..
ప్రస్తుతందృశ్యమాత్రంగా..
ఏది స్థిరం ?
మరి నా పయనమెక్కడికి ?
దేనికోసం ?
అన్నీకరిగిపోయేవే..
మిగిలిపోయేవే..
కదిలిపోయేవే..
నిలిచి పోయేవే ..
అంతా మిధ్య..