Tuesday, October 14, 2008
ఈరోజు -- నీకోసం
కలిసి తిరిగిన దారి నీ కోసమడిగింది
విసిగి పోయిన పిలుపు నీ ఊసు కోరింది
నిదుర మరచిన రేయి నీ జాడ వెదికింది
దారి చూపే నీ నవ్వులేవిఈరోజు ?
అలిసి వేచిన గుండె నీ కొరకు ఆగింది
కెరటమై నీ ఊహ నురుగులా ఆరింది
నింగి కెగిసిన ఊహ నేలపై రాలింది
ఊతమిచ్చే నీ చూపులేవిఈరోజు ?
చేతికందని లోకాలు నువు చేరినా
నీవు చూపిన బాట సాగుతున్నాను
బంధాలు వద్దని నను వీడినా
నీవు చెప్పిన ప్రేమ పంచుతున్నాను
చెంత నువ్వు లేని నిజం చంపుతున్నా
చింతనలో ఉన్నావన్న తృప్తిలో బ్రతుకుతున్నా !!
kalisi tirigina daari nee kOsamaDigindi
visigi pOyina pilupu nee uusu kOrindi
nidura maracina rEyi nee jaaDa vedikindi
daari cuupE nee navvulEvieerOju ?
alisi vEcina gunDe nee koraku aagindi
keraTamai nee uuha nurugulaa aarindi
ningi kegisina uuha nElapai raalindi
uutamiccE nee cuupulEvieerOju ?
cEtikandani lOkaalu nuvu cErinaa
neevu cuupina baaTa saagutunnaanu
bandhaalu vaddani nanu veeDinaa
neevu ceppina prEma pancutunnaanu
centa nuvvu lEni nijam camputunnaa
citanalO unnaavanna tRptilO bratukutunnaa !!
Subscribe to:
Posts (Atom)