Wednesday, February 18, 2009

ఆ మనసే ..

బంధాలల్లిన బూజు గూటిలో
బరువెక్కిన మనసూగుతోంది

ఆశగాలి దాన్ని రాలుస్తుందో
ఆ గూడే ఆసాంతం పెనవేస్తుందో
బాధ సాలీడే పెకలిస్తుందో
ఆగని కాలం మాత్రం
ఆ ఆటని ఆత్రంగా చూస్తుంది

ఆటలో గెలుపోటములు ఎవరివైనా
ఆర్తిని ఆశ్రయించేది,
ఆర్తనాదాలు ఆలపించేది
అశృధారలు ఆహ్వానించేది,
అలుపుని ఆస్వాదించేది
చివరికోటమిని ఆనందించేది ఆ మనసే..
ఆ మనసే ..

6 comments:

  1. aahaa, aatreya garu. enta baaga chepparandi..
    "aagani kaalam maatram aatani aatranga choostundhi" good one :)

    ReplyDelete
  2. మహేష్ గారు నా బ్లాగుకు స్వాగతం. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    సత్యవతి గారు స్వాగతమండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చిన్న పదాలతో ఎంత చక్కగా చెప్పారు గురువుగారూ !బావుందండీ !

    ReplyDelete
  4. నిజమే కదా!!!
    మనిషికెన్ని భాధలో
    మనసుకెన్ని అవస్థలో కదా!!!

    ReplyDelete
  5. పరిమళం గారు పధ్మార్పిత గారు ధన్యవాదాలు.

    ReplyDelete