Thursday, October 23, 2008

understuడ్డా ?

నా గుండెల్లో దేవతవంటూ
నా శ్వాసల్లో జీవం అంటూ
నా మాటల్లో భావం అంటూ
నే చెప్పే కవితలో నీకు

నా భావాల్లో బరువుల కన్నా
నా రాతల్లో సత్యం కన్నా
ఆ కవితల్లో పైత్యం ముందుగ
పరుగిడుకుంటూ చేరిందేమో

అందుకే బాగా ఆలోచించి
వేరే మార్గం పరిశీలించి
తప్పనిసరి అయి వేరే భాషను
ఆపద్ధర్మం వాడేస్తున్నా..

నీకు నచ్చిన englishలో
నాకు వచ్చిన thoughts ని రాస్తే
ఒక్క lineలో సరిపోయేది
సోది రాసే painఊ తప్పుండేది

ఇంతకీ what i am saying is
i miss u
హమ్మయ్యా understuడ్డా ?


naa gunDellO dEvatavanTuu
naa SvaasallO jeevam anTuu
naa maaTallO bhaavam anTuu
nE ceppE kavitallO neeku

naa bhaavaallO baruvula kannaa
naa raatallO satyam kannaa
aa kavitallO paityam munduga
parugiDukunTuu cErindEmO

andukE baagaa aalOcinci
vErE maargam pariSeelinci
tappanisari ayi vErE bhaashanu
avasaraaniki vaaDEstunnaa..

neeku naccina #english#lO
naaku vaccina #thoughts# ni raastE
okka #line#lO saripOyEdi
sOdi raasE #pain#uu tappunDEdi

intakee #what i am saying is#
# i miss u #
hammayyaa #understu#DDaa ?

నువ్వెక్కడ ?

ఆలోచనల అడవుల్లో
తిరిగితిరిగి అలిసి ఆగిన
ప్రతి మజిలీ ఎందుకో
నీ జ్ఞాపకమే అవుతుంది

నీ చిత్రాలు బందీ చేసి
పెట్టిన పేజీలు ఎంత
తిరగేసినా ఏదో తెలియని
అసంతృప్తి కొంటెగా ఇకిలిస్తుంది

వందల ముఖాలు రోజూ
చూస్తూ నవ్వులు ఎన్ని
ఒలికించినా నువ్వు లేని ఆ
వెలితి ఒంటరితనమై నవ్వుతుంది

ఇంతకీ నువ్వీ రోజెక్కడ ?
ఏమై పోయావు ?


aalOcanala aDavullO
tirigitirigi alisi aagina
prati majilee endukO
nee jnaapakamE avutundi

nee citraalu bandee cEsi
peTTina pEjeelu enta
tiragEsinaa EdO teliyani
asamtRpti konTegaa ikilistundi

vandala mukhaalu rOjuu
cuustuu navvulu enni
olikincinaa nuvvu lEni aa
veliti onTaritanamai navvutundi

నువ్వు

కక్షల కదన రంగాల్లో
ఎగిరొచ్చిన శ్వేత పత్రం
నిర్జీవ జనుల శోకాల్లో
ఎదురొచ్చిన ఆశా శిల్పం
నిస్తేజ నిశీధి వీధుల్లో
వెలుగిచ్చిన కాంతి కిరణం
కలవరింతల అసంపూర్ణ నిద్రల్లో
ఒడినిచ్చిన మాత్రు రూపం
వేడెక్కిన విధాత రాతల్లో
తరలొచ్చిన చల్లని పవనం
కబళించే కష్టాల ఊబుల్లో
చెయ్యిచ్చిన అమృత కలశం
నువ్వు !!


kakshala kadana rangaallO
egiroccina SvEta patram
nirjeeva janula SOkaallO
eduroccina aaSaa Silpam
nistEja niSeedhi veedhullO
velugiccina kaanti kiraNam
kalavarintala asampuurNa nidrallO
oDiniccina maatru ruupam
vEDekkina vidhaata raatallO
taraloccina callani pavanam
kabaLincE kashTaala uubullO
ceyyiccina amRta kalaSam
nuvvu !!

అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

కటిక ఉప్పుల తీరాల్లోనే హృద్యంగా ఉదయం
కరుడుగట్టిన గుండెల్లోనే ప్రజ్వాలిత కధనం
కసిపెరిగిన క్రోధాల్లోనే పసిఛాయల గమనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

వెనుదిరిగిన కెరటాల్లోనే తడియారిన తరళం
కునుకెరగని రాత్రుల్లోనే ఆలక్ష్యపు జననం
ఆక్రోశపు అరుపుల్లోనే గురుతుండె కవనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

కారడవుల గుప్పెట్లోనే చైతన్యపు సమరం
నిరసించిన హృదయాల్లోనే తొలిప్రేమాగమనం
నిశిరాతిరి సమయాల్లోనే స్వాతంత్ర్యపు కదనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

పడిపోయిన శిధిలాల్లోనే గతవైభవ శిఖరం
చేజారిన తరుణాల్లోనే మరుపెరుగని సకలం
చితిమంటల చిటపటలోనే మరుజన్మకు పయనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం



kaTika uppula teeraallOnE hRdyamgaa udayam
karuDugaTTina gunDellOnE prajvaalita kadhanam
kasiperigina krOdhaallOnE pasiChaayala gamanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

venudirigina keraTaallOnE taDiyaarina taraLam
kunukeragani raatrullOnE aalakshyapu jananam
aakrOSapu arupullOnE gurutunDe kavanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

kaaraDavula guppeTlOnE caitanyapu samaram
nirasincina hRdayaallOnE toliprEmaagamanam
niSiraatiri samayaallOnE swaatantryapu kadanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

paDipOyina SidhilaallOnE gatavaibhava Sikharam
cEjaarina taruNaallOnE maruperugani sakalam
citimanTala ciTapaTalOnE marujanmaku payanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam