Tuesday, April 1, 2025

చక్రం







అలసిన బండి
ఆగ మంటుంది
చాలిక సాగనంటుంది

ఆగిందే తడవు
వద్దని వదిలిన గమ్యాలకు
పరుగులిడుతుంది.

కదలి పోతుంది
తడిసిపోతుంది
తిరిగి అలసి పోతుంది

బరువుగా మరో ఉదయం
మేలుకుంటుంది
అలసే వరకు తిరిగి
సాగిపోతుంది.

ఎప్పుడవుతాయో !?









రెప్ప క్రింద
గులాబీ వనంలో
రాలిపడినవీ..

పారుతున్న ఏటి ధారల్లో
ఏరుకున్నవీ..

మెళుకువ మాటున
కీచురాళ్ళు పాడినవీ..

నిట్టూర్పుల వేడికి కరిగి
తెల్ల కాగితంపై మరకలవుతున్నాయి..

ఎటుచూసినా పదాలే..
ఇవి కవిత లెప్పుడవుతాయో !!?