Wednesday, September 17, 2008

గుర్తుకొస్తున్నాయి


తువ్వాయి వెనక పరుగులు
తూనీగ తోక దారాలు
పగిలిన బొంగరాలు
పట్టాలపై కోకు మూతలు

మామిడితోటల్లో దొంగతనాలు
మిద్దె మీదచేరి రాయబారాలు
బురద గుంటల్లో భరతనాట్యాలు
మురికి దుస్తుల వీపు డోలువాద్యాలు

పరీక్షలకు తోడిచ్చిన మడత చీటీలు
స్నేహంలో తీర్పిచ్చిన మడత పేచీలు
సాధించిన నూనుషో టిక్కెట్టు
తెలిసి నాన్నెట్టిన చీవాట్లు

మనసు మడతల్లో చూసేకొద్దీ
ఎన్ని రంగుల చిత్రాలో ఎన్ని ఆణిముత్యాలో
గుర్తుకొస్తున్నాయి !!
ఇక నేననుభవించలేనని అవి గేలిచేస్తున్నయి
నావయసు ఎంతో నాకు గుర్తు చేస్తున్నయి !!

గుర్తుకొస్తున్నయవి గేలిచేస్తున్నయి !

tuvvaayi venaka parugulu
tuuneega tOka daaraalu
pagilina bongaraalu
paTTaalapai kOku muutalu

maamiDitOTallO dongatanaalu
midde meedacEri raayabaaraalu
burada gunTallO bharatanaaTyaalu
muriki dustula veepu DOluvaadyaalu

pareekshalaku tODiccina maData ceeTeelu
snEhamlO teerpiccina maData pEceelu
saadhincina nuunushO TikkeTTu
telisi naanneTTina ceevaaTlu

manasu maDatallO cuusEkoddee
enni rangula citraalO enni aaNimutyaalO
gurtukostunnaayi !!
ika nEnanubhavincalEnani avi gElicEstunnayi
naavayasu entO naaku gurtu cEstunnayi !!

gurtukostunnayavi gElicEstunnayi !

నీ నవ్వు


విరజాజి పువ్వులా వెలిసిన వానలా
తెరచాప పడవలా పురివిప్పిన నెమలులా
చిన్నారి పాపలా పూదారి బాటలా
నీ నవ్వును సరితూగే మాటేదో చెప్పవా?

ఒదిగిన గువ్వలా అమ్మ చేతి బువ్వాలా
తొలిసంధ్య రంగులా గోదావరి పొంగులా
గిలిగింత వయసులా తొలిప్రేమ పిలుపులా
నీ నవ్వును సరితూగే మాటేదో చెప్పవా?

గుడిగంట మోతలా వరిపంట కోతలా
మాతాత మాటలా చందనపు పూతలా
పుప్పొడి కణంలా నా ఇప్పటి క్షణంలా
నీ నవ్వును సరితూగే మాటేదో చెప్పవా?

నీ నవ్వుకు పోలికగా నాకొచ్చిన ఊహలన్నీ
దేవునికో దణ్ణంలా సముద్రంలో వానలా
విలువతగ్గి ఓటమొగ్గి బిక్కచచ్చి నుంచున్నై
చెలీ ఆ నవ్వును సరితూగే మాటేదో చెప్పవా?


నీ నవ్వును సరితూగే ఆ ఒక్క మాటేదో
ఓటమొప్పని మనసు సాక్షిగా
చిట్ట చివరి ప్రయత్నంగా చెప్తున్నా!
అది నీ నవ్వే సఖీ, అది నీనవ్వే చెలీ !!

virajaaji puvvulaa velisina vaanalaa
teracaapa paDavalaa purivippina nemalulaa
cinnaari paapalaa puudaari baaTalaa
nee navvunu sarituugE maaTEdO ceppavaa?

odigina guvvalaa amma cEti buvvaalaa
tolisandhya rangulaa gOdaavari pongulaa
giliginta vayasulaa toliprEma pilupulaa
nee navvunu sarituugE maaTEdO ceppavaa?

guDiganTa mOtalaa varipanTa kOtalaa
maataata maaTalaa candanapu puutalaa
puppoDi kaNamlaa naa ippaTi kshaNamlaa
nee navvunu sarituugE maaTEdO ceppavaa?

nee navvuku pOlikagaa naakoccina uuhalannii
dEvunikO daNNamlaa samudramlO vaanalaa
viluvataggi OTamoggi bikkacacci nuncunnai
celee aa navvunu sarituugE maaTEdO ceppavaa?


nee navvunu sarituugE aa okka maaTEdO
OTamoppani manasu saakshigaa
ciTTa civari prayatnamgaa ceptunnaa!
adi nee navvE sakhee, adi neenavvE celee !!

నేను నీకేమౌతానో ?


కలిసి కాఫీలు తాగి
కధలు చెప్పి నప్పుడు, మనసు విప్పినప్పుడు
చెట్టపట్టాలేసుకుని చెట్లల్లో
కలిసి తిరిగి నప్పుడు, ఆడి అలిసినప్పుడు
గంటలతరబడి చాటుల్లో
సమయం చంపినప్పుడు, విషయం పంచినప్పుడు
భయాలు వదిలి బండి నడుపుతూ
ఫోను కాలాన్ని కాల్చినప్పుడు, మధుర క్షణాలు పెంచినప్పుడు

నేను నీకేంటొ ? నేను నీకేమౌతానో ?
తెలియని నా ప్రశ్నలకు సమాధానం,

నాకై నా బాధ నీ కళ్ళల్లో
కోటి వీణలు మీటిన అమృత వర్షిణిలా
కరిగి కురిసి నప్పుడు, నిశ్శబ్దం పలికినప్పుడు
శతకోటి వేణువులూదిన హిందోళమై
స్ఫురించింది - చిరునవ్వుగ ఉదయించింది .


kalisi kaafeelu taagi
kadhalu ceppi nappuDu, manasu vippinappuDu
ceTTapaTTaalEsukuni ceTlallO
kalisi tirigi nappuDu, aaDi alisinappuDu
ganTalatarabaDi caaTullO
samayam campinappuDu, vishayam pancinappuDu
bhayaalu vadili banDi naDuputuu
phOnu kaalaanni kaalcinappuDu, madhura kshaNaalu pencinappuDu

nEnu neekEnTo ? nEnu neekEmoutaanO ?
teliyani naa praSnalaku samaadhaanam,

naakai naa baadha nee kaLLallO
kOTi veeNalu meeTina amRta varshiNilaa
karigi kurisi nappuDu, niSSabdam palikinappuDu
SatakOTi vENuvuluudina hindOLamai
sphurincindi - cirunavvuga udayincindi .