Wednesday, October 15, 2008

అలక


కోర చూపులో ఎంత కోపమో
ముక్కంటి మోము మరి చిన్నబోదూ ?
పెదవి విరుపులో ఎంత వయ్యారమో
శివుని విల్లు తెలిసి చిన్నబోదూ ?
బృకుటి బిగిసి చూపేనెన్ని ముడులో
బ్రహ్మ ముడులు నేడు తేలికవవూ ?
మౌన గీతాల పైనెంత ప్రేమో
మయూఖ తంత్రులిపుడు మూగబోవూ ?

నోరు విప్పక నువ్వు
నవ్వు లొలకక నువ్వు
కన్నులార్పక నువ్వు
విలయ మిప్పుడు నువ్వు తెచ్చిపెట్టావు !!

కరుణించి క్రీగంట చూడరాదూ?
దయచేసి ఓనవ్వు విసరరాదూ ?


kOra cuupulO enta kOpamO
mukkanTi mOmu mari cinnabOduu ?
pedavi virupulO enta vayyaaramO
Sivuni villu telisi cinnabOduu ?
bRkuTi bigisi cuupEnenni muDulO
brahma muDulu nEDu tElikavavuu ?
mouna geetaala painenta prEmO
mayuukha tantrulipuDu muugabOvuu ?

nOru vippaka nuvvu
navvu lolakaka nuvvu
kannulaarpaka nuvvu
vilaya mippuDu nuvvu teccipeTTaavu !!

karuNinci kreeganTa cuuDaraaduu?
dayacEsi Onavvu visararaaduu ?

అమ్మ


జీవిత ఆటు పోట్లకు అల్లల్లాడే
బ్రతుకు పడవ బలం, మనసు
లంగరు దాన్ని పట్టి ఉన్నంత వరకే..

పరిస్థితుల ప్రకంపనాలకు చెదిరే
కలల సూన్యం విలువ, తృప్తి
కుండ దాన్ని చుట్టి ఉన్నంత వరకే..

అనంత తిమిరాలకు ఆవల
ఆశా దీపం వెలుగు, దైవం
చేయి దాన్ని చుట్టు ఉన్నంత వరకే..

కానీ

కష్ట సమయాల్లో అక్కునచేర్చే
అమృతతత్వ అస్థిత్వ రూపం, అమ్మ
వీడిపోయినా, వెన్నంటే ఉంటుంది !!


jeevita aaTu pOTlaku allallaaDE
bratuku paDava balam, manasu
langaru daanni paTTi unnanta varakE

paristhitula prakampanaalaku cedirE
kalala suunyam viluva, tRpti
kunDa daanni cuTTi unnanta varakE

ananta timiraalaku aavala
aaSaa deepam velugu, daivam
cEyi daanni cuTTu unnanta varakE

kaanee

kashTa samayaallO akkunacErcE
amRtatatva asthitva ruupam, amma
viiDipOyinaa, vennanTE unTundi