Wednesday, October 1, 2008

చేసెయ్యి


మౌనంగా ఉండొద్దు, దూరంగా జరగొద్దు, తెలియనట్టు తిరగొద్దు
నీ నొసటినైన ముడివెయ్యి
పెదవి విల్లునైనా విరిచేయ్యి
ఏదో ఒకటి చెయ్యి, మరేదైన చేసెయ్యి
నాతో మాటాడు, కాదూ కొట్లాడు, పోనీ పోట్లాడు
ఓ కోర చూపునన్నా విసిరెయ్యి
పోరా పొమ్మన్నన్న అరిచెయ్యి
ఏదో ఒకటి చెయ్యి, మరేదైన చేసెయ్యి
కనులు మూసుకోవద్దు, నవ్వు దాచుకోవద్దు, చెయ్యి ముడుచుకోవద్దు
ఏదో ఒకటి చెయ్యి, మరేదేమైనా చేసెయ్యి
ఏదేమైనా చేసెయ్యి, నా ఎదనైనాదోచేయ్యి
ఏదైనా చివరికదైనా చేసెయ్యి !!

mounamgaa unDoddu, duurangaa jaragoddu, teliyanaTTu tiragoddu
nee nosaTinaina muDiveyyi
pedavi villunainaa viricEyyi
EdO okaTi ceyyi, marEdaina cEseyyi
naatO maaTaaDu, kaaduu koTlaaDu, pOnee pOTlaaDu
O kOra cuupunannaa visireyyi
pOraa pommannanna ariceyyi
EdO okaTi ceyyi, marEdaina cEseyyi
kanulu muusukOvaddu, navvu daacukOvaddu, ceyyi muDucukOvaddu
EdO okaTi ceyyi, marEdEmainaa cEseyyi
EdEmainaa cEseyyi, naa edanainaadOcEyyi
Edainaa civarikadainaa cEseyyi !!

నీ మౌనంలో


ఏమిటో నీ మౌనంలో
కాలం కరిగిపోతుంది
కరిగి నా గతమౌతుంది
ఏమిటో నీ మౌనంలో
ప్రస్తుతం గడిచిపోతుంది
గడిచి నా స్వగతమౌతుంది
ఏమిటో నీ మౌనంలో
మనసు సూన్యమౌతుంది
సూన్యమైనా బరువవుతుంది
ఏమిటో నీ మౌనంలో
మాట కవితవుతుంది
కవితైనా నిను చేరుకుంటుందా?

EmiTO nee mounamlO
kaalam karigipOtundi
karigi naa gatamoutundi
EmiTO nee mounamlO
prastutam gaDicipOtundi
gaDici naa svagatamoutundi
EmiTO nee mounamlO
manasu suunyamoutundi
suunyamainaa baruvavutundi
EmiTO nee mounamlO
maaTa kavitavutundi
kavitainaa ninu cErukunTundaa?

ఎవరికోసమో ?


ఈ రోజు విశ్రాంతి గా, సరే! అలాగని పైకి కనిపిస్తూ,
కుర్చీలో కూర్చున్నా, బయటజోరున వాన,
స్కూలు వదిలినప్పుడు ఇంటికి పరిగెత్తే పిల్లల్లా
వాన నీరు రోడ్డున పరుగులెడుతుంది
బ్రతుకు పందెంలో అవీ అలిసినట్లున్నాయి
నాలాగే కొంతతడవు గుంటల్లో విశ్రమిస్తున్నయి
కాఫీ తాగుతూ పేపరు చదువుతున్నా
కప్పు ఖాళీ ఎప్పుడైందో తెలియలేదు
రెండు పేజీలు చదివినా ఒక్క విషయం ఎక్కలేదు
గడియారం ఎనిమిది కొట్టిందట
యంత్రాలు అబద్ధాలాడవుగా, నమ్మాను
ఏమిటో కొంత సమయం పాటు
నాలోనేను, నేను నాలో లేను, ఎవరి తలపుల్లో తప్పిపోయానో !
కాలం ఆగినట్టనిపించింది, కానీ చాలా సుఖమనిపించింది
కలలతో కడుపులు నిండవుగా ?
కానీ అవి చెదిరితే కళ్ళు మాత్రం నిండుతాయి
అయిష్టంగానే, తేరుకుని, మనసు వద్దంటున్నా బ్రతిమాలుకుని
మళ్ళీ బ్రతకనారంభించా! ఎవరికోసమో ?


ee rOju viSraanti gaa, sarE! alaagani paiki kanipistuu,
kurceelO kuurcunnaa, bayaTajOruna vaana,
skuulu vadilinappuDu inTiki parigettE pillallaa
vaana neeru rODDuna paruguleDutundi
bratuku pandemlO avee alisinaTlunnaayi
naalaagE kontataDavu gunTallO viSramistunnayi
kaafee taagutuu pEparu caduvutunnaa
kappu khaaLee eppuDaindO teliyalEdu
renDu pEjeelu cadivinaa okka vishayam ekkalEdu
gaDiyaaram enimidi koTTindaTa
yantraalu abaddhaalaaDavugaa, nammaanu
EmiTO konta samayam paaTu
naalOnEnu, nEnu naalO lEnu, evari talapullO tappipOyaanO !
kaalam aaginaTTanipincindi, kaanee caalaa sukhamanipincindi
kalalatO kaDupulu ninDavugaa ?
kaanee avi cediritE kaLLu maatram niDutaayi
ayishTamgaanE, tErukuni, manasu vaddanTunnaa bratimaalukuni
maLLee bratakanaarambhincaa! evarikOsamO ?