Monday, September 15, 2008

అంతా నువ్వే


పాప నవ్వుల్లో పచ్చని చేలల్లో
సాగే దారుల్లో గడిచిన గాధల్లో
వీచే గాలుల్లో వీడని తలపుల్లో
చెప్పే మాటల్లో చూసే కన్నుల్లో
వేచిన ఘడియల్లో వేదన కవితల్లో
విరిసిన పూవుల్లో మెరిసిన కళ్ళల్లో
చల్లని జల్లుల్లో తెల్లని వెన్నెల్లో
కదిలిన చేతనలో కడిగిన ముత్యంలో
వెచ్చని గుండెల్లో వచ్చిన కవితల్లో

ఇంతెందుకు అంతా... అంతా... ఈ జగమంతా !!
నిజం చెప్పనా ?
నా పిచ్చి ఊహలకు అంతేలేదు
పిచ్చిదైనా ఎంత బాగుంది ?
అంతా నువ్వే!! కానీ నువ్వెక్కడ ? కనిపించవే ?


paapa navvullO paccani cElallO
saagE daarullO gaDicina gaadhallO
veecE gaalullO veeDani talapullO
ceppE maaTallO cuusE kannullO
vEcina ghaDiyallO vEdana kavitallO
virisina puuvullO merisina kaLLallO
callani jallullO tellani vennellO
kadilina cEtanalO kaDigina mutyamlO
veccani gunDellO vaccina kavitallO
intenduku antaa... antaa... ee jagamantaa !!
nijam ceppanaa ?
naa picci uuhalaku antElEdu
piccidainaa enta baagundi ?
antaa nuvvE!! kaanee nuvvekkaDa ? kanipincavE ?

నేనెవరో మరోసారి తెలుపవా నేస్తం ?


బ్రతుకు బాటలో కలిశావు
గుండెలోతుల్లో ఒదిగావు
మనసుని మధనం చేశావు
ప్రేమను గుర్తుకు తెచ్చావు

కలలను తెచ్చావు
కవితలు రేపావు
మనిషిని చేశావు
మనసుని దోచావు

నాతో స్నేహం చేశానన్నావు
నీకే ప్రేమా లేదన్నావు
మనసుని మార్చే శోధన చేస్తూ
మరుపుని మదిలో ఆహ్వానించా !

నిన్ను మరిచి మన్ననను కున్న
కన్నీళ్ళ సాగరంలో జాత రనుకున్న
కానీ మొన్నటినుంచి నీ గురుతేలేదు
కాలం ఎలా జారిందో తెలియనే లేదు

కానీ ఒక్క పొరపాటు
నే పిలిచిన మరుపు
నన్ను నేను మరిచేలా చేసింది
నేనెవరో మరోసారి తెలుపవా నేస్తం ?

bratuku baaTalO kaliSaavu
gunDelOtullO odigaavu
manasuni madhanam cESaavu
prEmanu gurtuku teccaavu

kalalanu teccaavu
kavitalu rEpaavu
manishini cESaavu
manasuni dOcaavu

naatO snEham cESaanannaavu
neekE prEmaa lEdannaavu
manasuni maarcE SOdhana cEstuu
marupuni madilO aahvaaniMcaa !

ninnu marici mannananu kunna
kanneeLLa saagaramlO jaata ranukunna
kaanee monnaTinunci nee gurutElEdu
kaalam elaa jaarindO teliyanE lEdu

kaanee okka porapaaTu
nE pilicina marupu
nannu nEnu maricElaa cEsindi
nEnevarO marOsaari telupavaa nEstam ?

ఇది బ్రతుకయ్యింది !!


ఇది కల ఐనా బాగుండు
ఉదయాన్నే కరిగి పోయుండేది
ఇది ఊహ ఐనా బాగుండు
నిజమవదని మనసుకు కుదుటపడేది
ఇది కవిత ఐనా బాగుండు
పదాల్లో బందీగ కూర్చుండేది
ఇది కధ ఐనా బాగుండు
చివరి పుటతో సమసిపోయేది
విధి ఎవడికి తెలుసు ?
కనులెదుటే నిజమయ్యింది
చెరపలేని రాతయ్యింది
తీయనైన బాధయ్యింది
గుండె నిండిన ప్రేమయ్యింది
ఇది బ్రతుకయ్యింది !!


idi kala ainaa baagunDu
udayaannE karigi pOyunDEdi
idi uuha ainaa baagunDu
nijamavadani manasuku kuduTapaDEdi
idi kavita ainaa baagunDu
padaallO bandeega kuurcunDEdi
idi kadha ainaa baagunDu
civari puTatO samasipOyEdi
vidhi evaDiki telusu ?
kanuleduTE nijamayyindi
cerapalEni raatayyindi
teeyanaina baadhayyindi
gunDe ninDina prEmayyindi
idi bratukayyindi !!

నీ కలల వాకిళ్ళు


నీ కలల వాకిళ్ళు
నా కళ్ళు
చెక్కిళ్ళపై కళ్ళాపులు
ఆశల రంగ వల్లులు
నవ్వుల హరిగానాలు
కళ్ళు మూసుంటేనే
నా కలల సంక్రాంతి
తెరిస్తే దీపావళే !


nee kalala vaakiLLu
naa kaLLu
cekkiLLapai kaLLaapulu
aaSala ranga vallulu
navvula harigaanaalu
kaLLu muusunTEnE
naa kalala sankraanti
teristE deepaavaLE !

నువ్వెవరు ?


నెట్టినా పోని ఆలోచన
కట్టినా ఆగని తలపులు
గట్టెక్కని జ్ఞాపకాలు
ఉట్టెక్కని ఊహలు
నువ్వెవరు ?
నీకు నేనెవరు ?
పేరొక కమ్మని కావ్యం
స్పర్స ఒక చందన లేపనం
తలపొక సుందర దృశ్యం
మాటొక తీయని గానం
నవ్వొక చల్లని గమ్యం
నా ఊహవు కావుగదా?
నా కవితా సుందరి కావుగదా?
నేనంటే ఎంత మక్కువ !
నాకోసం రూపంతో వచ్చావా !?


neTTinaa pOni aalOcana
kaTTinaa aagani talapulu
gaTTekkani jnaapakaalu
uTTekkani uuhalu
nuvvevaru ?
neeku nEnevaru ?
pEroka kammani kaavyam
sparsa oka candana lEpanam
talapoka sundara dRSyam
maaToka teeyani gaanam
navvoka callani gamyam
naa uuhavu kaavugadaa?
naa kavitaa sundari kaavugadaa?
nEnanTE enta makkuva !
naakOsam ruupamtO vaccaavaa !?

అంతా నువ్వే


విరిసిన పూవుల్లో మెరిసిన కళ్ళల్లో
చల్లని జల్లుల్లో తెల్లని వెన్నెల్లో
కదిలిన చేతనలో కడిగిన ముత్యంలో
వెచ్చని గుండెల్లో వచ్చిన కవితల్లో
అంతా నువ్వే చెలీ అంతా నువ్వే !!

virisina puuvullO merisina kaLLallO
callani jallullO tellani vennellO
kadilina cEtanalO kaDigina mutyamlO
veccani gunDellO vaccina kavitallO
antaa nuvvE celee antaa nuvvE !!

అపరిచితులు


మనసు గోడపై పచ్చపొడిచిన
నీ పేరు ఎప్పుడు చెరగబోదు
వీడుకోలుతో గుండెకొచ్చిన
గాయమిప్పుడు మాని పోదు
నీ లేత మనసును గుచ్చి వుంటే
నా మాట నిన్ను నొచ్చి వుంటే
కోపమొకింత చూపి ఐనా
బాధ పక్కకు నెట్టు నేస్తం !
తప్పటడుగులు వేశానేమో
నేను తప్పులు చేశానేమో
క్షమను చూపి ఈ ఒక్క సారికి
అపరిచితులుగ మారుదామ?
మంచి ముహూర్తము ఒకటి చూసి
తిరిగి పరిచయం పెంచుదామా?


manasu gODapai paccapoDicina
nee pEru eppuDu ceragabOdu
veeDukOlutO gunDekoccina
gaayamippuDu maani pOdu
nee lEta manasunu gucci vunTE
naa maaTa ninnu nocci vunTE
kOpamokinta cuupi ainaa
baadha pakkaku neTTu nEstam !
tappaTaDugulu vESaanEmO
nEnu tappulu cESaanEmO
kshamanu cuupi ee okka saariki
aparicituluga maarudaama?
manci muhuurtamu okaTi cuusi
tirigi paricayam pencudaamaa?