Wednesday, October 8, 2008

పునర్జన్మ




పునరావృత్తిరహిత సుందర సుదూర ఖండాల్లోనుంచి
స్వలీలాకల్పితబ్రహ్మాండ ఆడంబర మండలాల్లోనుంచి
మదగ్నిగుండసంభూత నవదేహునైతి
అంతర్మధనసంజాత నవ కుసుమమైతి
నితాంతసచ్చిదానంద చిత్స్వరూపినైతి
సర్వబంధ వినిర్ముక్త చైతన్యఝరినైతి
అభంగశుభంగ ఉత్తుగతరంగమైతి
ప్రక్షాళిత గంగనైతి కవితాలహరినైతి


punaraavRttirahita sundara suduura khanDaallOnunci
swaleelaakalpitabrahmaanDa aaDambara manDalaallOnunci
madagnigunDasambhuuta navadEhunaiti
antarmadhanasanjaata nava kusumamaiti
nitaantasaccidaananda citswaruupinaiti
sarvabandha vinirmukta caitanyajharinaiti
abhangaSubhanga uttugatarangamaiti
prakshaaLita ganganaiti kavitaalaharinaiti

తిరిగి నా జననం నేను నేనులా..


ధరణి గర్భాన్ని చీల్చుకొచ్చిన వజ్రంలా
పాషాణం కంటే కఠినంగా..
సాగర మధనంలో ఉద్భవించిన అమృతంలా
మృతజీవులకు మరో ప్రాణంలా..
శతకోటి పుష్పాలు కలిసిన అత్తరులా
పరిమళాలకే ఒక కొత్త రూపంలా..
కొలిమిలో కాగి కరిగిన బంగారంలా
స్వచ్చతకే సరికొత్త ప్రమాణంలా..
అనంత తిమిరాలకు ఆవల సంధ్య కిరణంలా
ఆర్తుల అక్కరకొచ్చిన ఒక వరంలా..
బాధల బొడ్డుప్రేగు తునిగిన బిడ్డలా
తిరిగి నా జననం నేను నేనులా..


dharaNi garbhaanni ceelcukoccina vajramlaa
paashaaNam kanTE kaThinamgaa..
saagara madhanamlO udbhavincina amRtamlaa
mRtajeevulaku marO praaNamlaa..
SatakOTi pushpaalu kalisina attarulaa
parimaLaalakE oka kotta ruupamlaa..
kolimilO kaagi karigina bangaaramlaa
swachchatakE sarikotta pramaaNamlaa..
ananta timiraalaku aavala sandhya kiraNamlaa
aartula akkarakoccina oka varamlaa..
baadhala boDDuprEgu tunigina biDDalaa
tirigi naa jananam nEnu nEnulaa..

మనసు ( లో ) మాట


నువ్వేం ప్రపంచ సుందరివి కావు
మొదటిసారిగా మనసు నా కళ్ళని నమ్మనంది
నీ మాటలేమీ మబ్బు తునకల్లా మృదువు కాదు
మొదటిసారిగా మనసు నా మాట నమ్మనంది
నీ నవ్వేమీ గలగల పారే సెలయేరులా వుండదు
మొదటిసారిగా మనసు నా ఊహ నమ్మనంది
నీ మందహాసమేమీ చంద్రునిలా చల్లగా వుండదు
మొదటిసారిగా మనసు నే చెప్పేది నమ్మనంది
నీ కళ్ళేమీ మమతల కొలువేమీ కాదు
మొదటిసారిగా మనసు నన్ను నమ్మనంది
నీ పై నాకేమీ ప్రేమలేదు
మొదటిసారిగా మనసు నా గోడు విననంది
నా మనసు నమ్మేమాట ఒక్కటి చెప్పనా చెలీ!!
మొదటిసారిగా నా మనసు మరో మాట పలకనంది

nuvvEm prapanca sundarivi kaavu
modaTisaarigaa manasu naa kaLLani nammanandi
nee maaTalEmee mabbu tunakallaa mRduvu kaadu
modaTisaarigaa manasu naa maaTa nammanandi
nee navvEmee galagala paarE selayErulaa vunDadu
modaTisaarigaa manasu naa uuha nammanandi
nee mandahaasamEmee candrunilaa callagaa vunDadu
modaTisaarigaa manasu nE ceppEdi nammanandi
nee kaLLEmee mamatala koluvEmee kaadu
modaTisaarigaa manasu nannu nammanandi
nee pai naakEmee prEmalEdu
modaTisaarigaa manasu naa gODu vinanandi
naa manasu nammEmaaTa okkaTi ceppanaa celii!!
modaTisaarigaa naa manasu marO maaTa palakanandi

నీతోనే నా మనసు వదిలి పోతున్నా


గుండె పగిలి పోతున్నా మనసు నలిగి పోతున్నా
కనులు ఒలికి పోతున్నా మనిషి రగిలి పోతున్నా
గొంతు ఆరి పోతున్నా కాళ్ళు వణికి పోతున్నా
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా
నడవలేని పాదాలు ఈడ్చుకుంటూ, నా బాటలోని పూలను నీకోసమేరుకుంటూ
కన్నీటిని కొన వేలితో తుడుచుకుంటూ, నీ ఎడబాటును తలుచుకుంటూ
మసకేసిన నా కళ్ళని చివరిసారి బ్రతిమాలుకుంటూ, బ్రతుకీడ్చుకుంటూ
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా
భారమైన హృదయంతో వివర్ణమైన వదనంతో
అంతరంగ మంధనంతో బరువైన జ్ఞాపకాల గ్రంధంతో
ఊసులన్నీ పదిలంగా దాచుకుంటూ మరలని నీ తోడు తెలిసీ చేజార్చుకుంటూ
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా


gunDe pagili pOtunnaa manasu naligi pOtunnaa
kanulu oliki pOtunnaa manishi ragili pOtunnaa
gontu aari pOtunnaa kaaLLu vaNiki pOtunnaa
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa
naDavalEni paadaalu eeDcukunTuu, naa baaTalOni puulanu neekOsamErukunTuu
kanneeTini kona vElitO tuDucukunTuu, nee eDabaaTunu talucukunTuu
masakEsina naa kaLLani civarisaari bratimaalukunTuu, bratukeeDcukunTuu
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa
bhaaramaina hRdayamtO vivarNamaina vadanamtO
antaranga mandhanamtO baruvaina jnaapakaala grandhamtO
uusulannee padilangaa daacukunTuu maralani nee tODu telisee cEjaarcukunTuu
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa

తప్పేముంది ?


ఒంటి చేత్తో చప్పట్లు మోగవు
మోగనప్పుడు చేతులు కట్టుకోవడంలో తప్పేముంది ?
కంటి నీళ్ళతో హృదయాలు కరగవు
కరగనప్పుడు కన్నీళ్ళను మింగడంలో తప్పేముంది?
మేళాలతో పెళ్ళిళ్ళు జరగవు
జరగనప్పుదు ఆశలు చంపటంలో తప్పేముంది?
నోటి మాటతో ప్రేమలు పండవు
పండనప్పుదు నోరు మూసుకోవడంలో తప్పేముంది?

తనదారిన తనని వదలడంలో తప్పేముంది?
నేను తప్పుకుంటంలో తప్పేముంది ?

onTi cEttO cappaTlu mOgavu
mOganappuDu cEtulu kaTTukOvaDamlO tappEmundi ?
kanTi neeLLatO hRdayaalu karagavu
karaganappuDu kanneeLLanu mingaDamlO tappEmundi?
mELaalatO peLLiLLu jaragavu
jaraganappudu aaSalu campaTamlO tappEmundi?
nOTi maaTatO prEmalu panDavu
panDanappudu nOru muusukOvaDamlO tappEmundi?


tanadaarina tanani vadalaDamlO tappEmundi?
nEnu tappukunTamlO tappEmundi ?

నా మౌనం


నా మౌనంలో తీయని బాధుంది
నిను బాధించనన్న భావనుంది
నువు సుఖంగా ఉంటావన్న ఆశవుంది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం

నా మౌనంలో తెలియని కోతవుంది
నీ నవ్వు చెదరదన్న ఆకాంక్షుంది
నీ బ్రతుకున పువ్వులునిండాలన్న కోరికుంది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం

నా మౌనంలో తీరని ఆశుంది
నీ బాటన ముళ్ళుండవనిపించింది
నీ వయసంతా వసంతమనిపించిది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం

నా బ్రతుకును నే మార్చుకున్నా
నా ఆశలు నే మింగుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
అంతా నా స్వార్ధం అందుకే నా ఈ మౌనం

naa mounamlO teeyani baadhundi
ninu baadhincananna bhaavanundi
nuvu sukhamgaa unTaavanna aaSavundi
antaa naaswaardham andukE naa ee mounam

naa mounamlO teliyani kOtavundi
nee navvu cedaradanna aakaankshundi
nee bratukuna puvvuluninDaalanna kOrikundi
antaa naaswaardham andukE naa ee mounam

naa mounamlO teerani aaSundi
nee baaTana muLLunDavanipincindi
nee vayasantaa vasantamanipincidi
antaa naaswaardham andukE naa ee mounam

naa bratukunu nE maarcukunnaa
naa aaSalu nE mingutunnaa
nee sukhamE nE kOrukunnaa
antaa naa swaardham andukE naa ee mounam

నే కోరుకున్నది


గలగల పారే నీ నవ్వు
గిలిగింతలు పెట్టే నీ మాట
హాయిని కురిసే నీ కళ్ళు
ఆ సహజత్వమె నేకోరుకున్నది

నొప్పించని నీ గుణం
లాలించే నీ మనసు
క్షమించే నీ తత్వం
ఆ సున్నితత్వమే నేకోరుకున్నది

చనువుగా తిరిగే నీ వైనం
విసుగనిపించని నీ ఊసులు
వినసొంపైన నీ గళం
ఆ స్నేహత్వమే నేకోరుకున్నది

నాతప్పులు చూపే నీ ధైర్యం
నా మంచిని తెలిపే నీ చొరవ
నిరసన ప్రకటించే నీ మౌనం
ఆ సమతత్వమే నేకోరుకున్నది

నా బాధకు నీ అయ్యోలు
నా గొప్పకు నీ అబ్బోలు
నా చెంతన మన అరెయ్* ఒరెయ్* లు
ఆ మన-తత్వమే నేకోరుకున్నది

చంచలంగా నవ్వులు ఒలికిస్తూ
దయగల వాక్కులు పలికేస్తూ
నచ్చిన పనులే చేసేస్తూ
ఆ నీ ప్రస్తుతమే నేకోరుకున్నది

నా ఉనికి నిను మార్చొచ్చు
నా మాటను నిను కదిలించొచ్చు
నా ప్రేమ నిను బాధించొచ్చు
అందుకే నా మౌనం,
నీ సుఖమే నేకోరుకున్నది


galagala paarE nee navvu
giligintalu peTTE nee maaTa
haayini kurisE nee kaLLu
aa sahajatvame nEkOrukunnadi

noppincani nee guNam
laalincE nee manasu
kshamincE nee tatvam
aa sunnitatvamE nEkOrukunnadi

canuvugaa tirigE nee vainam
visuganipincani nee uusulu
vinasompaina nee gaLam
aa snEhatvamE nEkOrukunnadi

naatappulu cuupE nee dhairyam
naa mancini telipE nee corava
nirasana prakaTincE nee mounam
aa samatatvamE nEkOrukunnadi

naa baadhaku nee ayyOlu
naa goppaku nee abbOlu
naa centana mana arey orey lu
aa mana-tatvamE nEkOrukunnadi

chancalangaa navvulu olikistuu
dayagala vaakkulu palikEstuu
naccina panulE cEsEstuu
aa nee prastutamE nEkOrukunnadi

naa uniki ninu maarcoccu
naa maaTanu ninu kadilincoccu
naa prEma ninu baadhincoccu
andukE naa mounam,
nee sukhamE nEkOrukunnadi

ఎప్పుడో


ప్రతి క్షణము నిను తలుచుకున్నా
ప్రతి కణము నువ్వేననుకున్నా
ప్రతి చోటా నిన్నే వెదుక్కున్నా గాలిమూటలు కట్టుకున్నా
మదిలో నిను దాచుకున్నా
మనసుతో నిను పూజించుకున్నా
మరుపునే ఏమార్చుకున్నా ఇసుక రాతలు రాసుకున్నా
స్నేహం నీతో పంచుకున్నా
ఊసులు నీతో చెప్పుకున్నా
కవిత నీపై అల్లుకున్నా అస్థిత్వాన్ని వదులుకున్నా

ఆశ హద్దులు చెరుపుకుంటూ నింగి నిచ్చెన వేసుకున్నా
నిజం నిప్పుల మధ్య నేడు మనసు మసిగా మార్చు కున్నా

తప్పు చేసిన మనిషి నేను
ఒప్పు చేసే దారి కోసం మౌన యాగం చేస్తున్నా

ఈ మధనకంతము ఎప్పుడో
ఈ బంధమెప్పుడు తునుగునో
ఈ బరువు ఎప్పుడు తీరునో
ఈ బ్రతుకు ఎప్పుడు మారునో


prati kshaNamu ninu talucukunnaa
prati kaNamu nuvvEnanukunnaa
prati cOTaa ninnE vedukkunnaa gaalimuuTalu kaTTukunnaa
madilO ninu daacukunnaa
manasutO ninu poojincukunnaa
marupunE Emaarcukunnaa isuka raatalu raasukunnaa
snEham neetO pancukunnaa
uusulu neetO ceppukunnaa
kavita neepai allukunnaa asthitvaanni vadulukunnaa

aaSa haddulu cerupukunTuu ningi niccena vEsukunnaa
nijam nippula madhya nEDu manasu masigaa maarcu kunnaa

tappu cEsina manishi nEnu
oppu cEsE daari kOsam mouna yaagam cEstunnaa

ee madhanakantamu eppuDO
ee bandhameppuDu tunugunO
ee baruvu eppuDu teerunO
ee bratuku eppuDu maarunO

నా నిద్ర


చంద్రుడొచ్చి నాతో ఆడలేదని అలిగినట్టుంది
కాలం నాకోసం ఆగలేదని కినుక పట్టినట్టుంది
వేచినా వసంతమింకా రాలేదని విసిగినట్టుంది
నాకై వానాగలేదని నే వగచినట్టుంది
ఇది నా శాపమని నే కసిరినట్టుంది
ఎదో భ్రమలోనే నే చివరికి బ్రతికి నట్టుంది
నీ కోసం నా మౌనం ? నేనెవరని ? నువ్వెవరని ?
నా ప్రేమకి నేనెవరో తెలియనట్టుంది
నా మనసు నాపై నవ్వినట్టుంది
నను చూసి నా బ్రతుకు ఇకిలించి నట్టుంది
నా కవిత నను చూసి గేలిచేసినట్టుంది
ఈ బూటకపు బాధ నన్నొదిలి పోయినట్టుంది
నా చివరి నిద్ర నాకై వేచినట్టుంది
ఎన్నాళ్ళకో మళ్ళీ ఆ నిద్ర నను చేరినట్టుంది

candruDocci naatO aaDalEdani aliginaTTundi
kaalam naakOsam aagalEdani kinuka paTTinaTTundi
vEcinaa vasantaminkaa raalEdani visiginaTTundi
naakai vaanaagalEdani nE vagacinaTTundi
idi naa Saapamani nE kasirinaTTundi
edO bhramalOnE nE civariki bratiki naTTundi
nee kOsam naa mounam ? nEnevarani ? nuvvevarani ?
naa prEmaki nEnevarO teliyanaTTundi
naa manasu naapai navvinaTTundi
nanu cuusi naa bratuku ikilinci naTTundi
naa kavita nanu cuusi gElicEsinaTTundi
ee buuTakapu baadha nannodili pOyinaTTundi
naa civari nidra naakai vEcinaTTundi
ennaaLLakO maLLee aa nidra nanu cErinaTTundi