Wednesday, September 24, 2008

నా నీడ


ఉదయాన్నే నాతోడొస్తావు
మధ్యాహ్నానికి నాతో కలుస్తావు
సాయంత్రానికి దూరంగా వెళ్తావు
రోజంతా చూట్టూ తిరుగుతావు
చిలిపిగా దోబూచులాడతావు
వెలుగుల్లో నన్నంటి ఉంటావు
చీకట్లో అంతా ఉంటావు
నిను ముట్టలేను - ముట్టి మురవలేను
నిను కట్టలేను - కట్టి దాచలేను
నిను విడవలేను - విడిచి బ్రతకలేను
ఎప్పటికీ నాతోడుగ నువ్వుంటావా ?

నేనే నువ్వన్నప్పుడు
నాతోనే నువ్వున్నప్పుడు
నా రుజువే నువ్వైనప్పుడు
నా నీడవు నువ్వైనప్పుడు,
ఆ ప్రశ్నకు తావేలేదు!!


udayaannE naatODostaavu
madhyaahnaaniki naatO kalustaavu
saayantraaniki duurangaa veLtaavu
rOjantaa cuuTTuu tirugutaavu
cilipigaa dObuuculaaDataavu
velugullO nannanTi unTaavu
ceekaTlO antaa unTaavu
ninu muTTalEnu - muTTi muravalEnu
ninu kaTTalEnu - kaTTi daacalEnu
ninu viDavalEnu - viDici bratakalEnu
eppaTikee naatODuga nuvvunTaavaa ?

nEnE nuvvannappuDu
naatOnE nuvvunnappuDu
naa rujuvE nuvvainappuDu
naa neeDavu nuvvainappuDu,
aa praSnaku taavElEdu!!

మనసు పొత్తిళ్ళు


వెలిసిన వాన లాగా
తడి ఆరిన ఆ కళ్ళు
మంచు ముద్దాడిన పచ్చికలా
ఆ కళ్ళ వాకిళ్ళు
కరిగిన గుండెల క్రిందన
చెదిరిన వేదన తుంపరలు
మనసు పొత్తిళ్ళలో
శాంతి పాపల కిలకిలలు !!


velisina vaana laagaa
taDi aarina aa kaLLu
mancu muddaaDina paccikalaa
aa kaLLa vaakiLLu
karigina gunDela krindana
cedirina vEdana tumparalu
manasu pottiLLalO
Saanti paapala kilakilalu !!