Wednesday, November 12, 2008

84 శిష్యులకు దూరమైన ' ఏ ' కాకి గురువు

సరిగమలు సరి గమనమెరుగక
పదనిసలు పలు దిశలకుజనగ
పద పదమను పదములుడిగి నిశి
దిశలు దిగి పరి గరిమలు దిరగ
సరిగమన పద మెదక మనమున
పరి తరులు వెదక దగినది కవి .......... యే !!

sarigamalu sari gamanamerugaka
padanisalu palu diSalakujanaga
pada padamanu padamuluDigi niSi
diSalu digi pari garimalu diraga
sarigamana pada medaka manamuna
pari tarulu vedaka daginadi kavi .......... yE !!

( చిర ) కాలచక్రం

నా ప్రస్తుతం నా ప్రమేయంలేకుండ
కరిగి గత మవుతుంది

గతమంతా నిండి నా బ్రతుకవుతుంది

స్వగతమయిన ప్రస్తుతాన్ని పరికించేలోపే
నా రేపు నేడవుతుంది నా నీడవుతుంది

నా నీడను పట్టి కట్టలేను
ఏ రేపునూ చూడలేను
గతంలో బ్రతకలేను

ఈ చక్రానికి విరుగుడెప్పుడు ?


naa prastutam naa pramEyamlEkunDa
karigi gata mavutundi

gatamantaa ninDi naa bratukavutundi

svagatamayina prastutaanni parikincElOpE
naa rEpu nEDavutundi naa neeDavutundi

naa neeDanu paTTi kaTTalEnu
E rEpunuu cuuDalEnu
gatamlO bratakalEnu

ee cakraaniki viruguDeppuDu ?