Thursday, September 18, 2008

మనసు కలిగింది కాబోలు


శిల్పి మీద కరుణ కలిగింది కాబోలు
కొండ కండలు కరిగి శిల్పమైనట్లు
నా చెలియ మీద మనసు కలిగింది కాబోలు
అందమంతా కలిసి ఆమె కళ్ళల్లో విరిసింది

నింగి అంటే మనసు కలిగింది కాబోలు
రంగుధనసై ఎగిరి గగనంలో వాలినట్లు
నా చెలియ మీద మనసు కలిగింది కాబోలు
చంద్రునొదిలిన తెలుపు తన కళ్ళల్లో చేరింది

నేల అంటె ప్రేమ పెరిగింది కాబోలు
ఆలింగనంలో జలధి వడిసి పట్టినట్లు
నా చెలియ మీద మనసు కలిగింది కాబోలు
రూపు మార్చిన రాత్రి కనుపాప నంటింది

నల్ల చంద్రుని శొభ, తెల్ల రాత్రుల వెలుగులు
అందమేమో మాత్ర పదము కాగా !!
లోకమంతా జనులు గగ్గోలు పెడుతుంటే
నేను మాత్రం జగతి బంధాలు వదిలాను !!

చెలియ కన్నుల్లొ నేచూస్తూ జన్మ మరిచా !!!


Silpi meeda karuNa kaligindi kaabOlu
konDa kanDalu karigi SilpamainaTlu
naa celiya meeda manasu kaligindi kaabOlu
andamantaa kalisi aame kaLLallO virisindi

ningi anTE manasu kaligindi kaabOlu
rangudhanasai egiri gaganamlO vaalinaTlu
naa celiya meeda manasu kaligindi kaabOlu
candrunodilina telupu tana kaLLallO cErindi

nEla anTe prEma perigindi kaabOlu
aalinganamlO jaladhi vaDisi paTTinaTlu
naa celiya meeda manasu kaligindi kaabOlu
ruupu maarcina raatri kanupaapa nanTindi

nalla candruni Sobha, tella raatrula velugulu
andamEmO maatra padamu kaagaa !!
lOkamantaa janulu gaggOlu peDutunTE
nEnu maatram jagati bandhaalu vadilaanu !!

celiya kannullo nEcuustuu janma maricaa !!!

ఓ దారి చూపు చెలియా !!


నిదుర పోయే కనులు తెరవలేను
కలలలో నుండి నువ్వు తప్పుకుంటే ?
ఎదురు చూస్తూ కనులు మూయలేను
ఎదుట నిలిచిన నువ్వు మాయమైతే ?
జాగురూకతలోనె నే మెలగలేను
నా ఊహల్లోనే నీవు మిగిలిపోతే ?
నీ ఊహనుండి నే బయటకీ రాలేను
బయట నీ జాడ తెలియ కుంటే?
తోడుగానూ నీ వెంట ఉండలేను
నాతోడు వద్దని నువ్వెళ్ళిపోతే ?
నిను విడిచేసి నా బ్రతుకు నడపలేను
తిరిగి కలిసే భాగ్యం రాకపోతే ?
ఇన్ని ద్వందాల మధ్య బ్రతకలేను
కరుణించి ఓ దారి చూపు చెలియా !!

nidura pOyE kanulu teravalEnu
kalalalO nunDi nuvvu tappukunTE ?
eduru cuustuu kanulu muuyalEnu
eduTa nilicina nuvvu maayamaitE ?
jaaguruukatalOne nE melagalEnu
naa uuhallOnE neevu migilipOtE ?
nee uuhanunDi nE bayaTakee raalEnu
bayaTa nee jaaDa teliya kunTE?
tODugaanuu nee venTa unDalEnu
naatODu vaddani nuvveLLipOtE ?
ninu viDicEsi naa bratuku naDapalEnu
tirigi kalisE bhaagyam raakapOtE ?
inni dvandaala madhya bratakalEnu
karuNinci O daari cuupu celiyaa !!