Saturday, February 14, 2009

నీ బ్రతుకూ బ్రతుకేనా ?

నడక నేర్పిన చేయి నిస్సత్తువై వణకుతుంటే
రెక్క లొచ్చిన కాళ్ళు వెనుదిరిగి వెక్కిరిస్తూ
పచ్చ నోట్ల తోనె పలుకరిస్తుంటే
పలుకు లిచ్చిన పెదాలు పాలి పోయాయి
నీ కోసం ప్రార్ధనలో మునకలెస్తున్నాయి !!

పొత్తి గుడ్డల్లో స్వార్ధాన్ని సాకుతున్నామని
ఆనాడీ పిచ్చి పెద్దోళ్ళకెరుక లేదు
ప్రేమగా లాలించి పాము పెంచామని
ఈనాటికీ వీరు ఒప్పుకోరు

చెదిరిన గుండెలు పిండిన చమురులో
ఆశదీపాలెట్టి బేలగా చూస్తున్నారు.

పున్నామ నరకాల మాట చచ్చాక
బ్రతికుండగా వీడు కొరివి పెడుతున్నాడు
బాధలతొ పెరిగిన గుండె మంటను
పచ్చనోటుతో ఆర్పచూస్తున్నాడు

నేర్చిన నడకకు వచ్చిన పలుకుకు
వెలగట్టు నీ బ్రతుకూ బ్రతుకేనా ?


===========================

naDaka nErpina cEyi nissattuvai vaNakutunTE
rekka loccina kaaLLu venudirigi vekkiristuu
pacca nOTla tOne palukaristunTE
paluku liccina pedaalu paali pOyaayi
nii kOsam praardhanalO munakalestunnaayi !!

potti guDDallO svaardhaanni saakutunnaamani
aanaaDii picci peddOLLakeruka lEdu
prEmagaa laalinci paamu pencaamani
iinaaTikii viiru oppukOru

cedirina gunDelu pinDina camurulO
aaSadiipaaleTTi bElagaa cuustunnaaru.

punnaama narakaala maaTa caccaaka
bratikunDagaa viiDu korivi peDutunnaaDu
baadhalato perigina gunDe manTanu
paccanOTutO aarpacuustunnaaDu

nErcina naDakaku vaccina palukuku
velagaTTu nii bratukuu bratukEnaa ?