Thursday, November 13, 2008

అన్నట్టు తిరిగి రాకెపుడో ?

దగ్గరున్నా గుండె తెరిచి
ప్రేమ చూపింది లేదు గానీ
కొన్నాళ్ళకైనా నిను చూడలేనంటే
తెగిన పటం గాలికూగినట్టుంది

చెంతనున్నా గొంతు విప్పి
ఊసు చెప్పింది లేదు గానీ
కొంతకాలమైనా మాటకుదరదంటే
వీణ నుండి రాగ మూడినట్టుంది

వేరు తీరాలమని చెప్పి
నన్ను ఒప్పించుకున్నా
కొన్నిరోజులైనా ఇక కలవలేమంటే
కాలమెందుకో అసలు కదల నట్టుంది

ప్రకృతి నామీద ఈరోజు అలిగినట్టుంది


daggarunnaa gunDe terici
prEma cuupindi lEdu gaanee
konnaaLLakainaa ninu cuuDalEnanTE
tegina paTam gaalikuuginaTTundi

centanunnaa gontu vippi
uusu ceppindi lEdu gaanee
kontakaalamainaa maaTakudaradanTE
veeNa nunDi raaga muuDinaTTundi

vEru teeraalamani ceppi
nannu oppincukunnaa
konnirOjulainaa ika kalavalEmanTE
kaalamendukO asalu kadala naTTundi

prakRti naameeda eerOju aliginaTTundi
annaTTu #when r u coming back ? #

తెలుగు palindrome ప్రయత్నం !!

భక్తి భావం లేక, డబ్బుకోసం ఆడంబరాలకోసం
భక్తిని నటించే స్థలానికి పోవద్దని ఒక నర్తకికి
సలహా ఇచ్చే సన్నివేశం.

(న) అజ భక్తి నొదిలి దినోక్తి భజన (అ)
ల ఏ కరవుకూ నటనకూ వురక లే ల ?
ఆ కనకరాశి నొగ్గి నో సీ రా! (ఆ ) కనక (ఆ)
కీర్తనకు పోకు నర్తకీ !!


ఇది నా మొదటి ప్రయత్నం. బ్లాగులోకంలోని పెద్దలు
చదువు తల్లి ముద్దు బిడ్డలు నా తప్పులను దిద్ద గలరు.

palindrome అంటే తెలియని వారికి:
ఈ కవితలోని ప్రతి పాదమూ, ఎటు నుంచి చదివినా ఒకటే గా ఉంటుందన్న మాట.
"కీర్తనకు పోకు నర్తకీ " -- మీరు కుడి నుండి ఎడమకు చదివినా, ఎడమ నుండి కుడి వైపుకు చదివినా
ఒకటే !! అదన్న మాట ఇక్కడ ప్రత్యేకత.


bhakti bhaavam lEka, DabbukOsam aaDambaraalakOsam
bhaktini naTincE sthalaaniki pOvaddani oka nartakiki
salahaa iccE sannivESam.

(na) aja bhakti nodili dinOkti bhajana (a)
la E karavukuu naTanakuu vuraka lE la ?
aa kanakaraaSi noggi nO sii raa! aa kanaka
keertanaku pOku nartakee !!


idi naa modaTi prayatnam. blaagulOkamlOni peddalu
caduvu talli muddu biDDalu naa tappulanu didda galaru.