Friday, September 26, 2008

ఆ బాట


నందన వనాలు నాకఖ్ఖరలేదు
సుందర హర్మ్యాలు అవసరంలేదు
అత్తరు గంధాలు అసలేవద్దు
పూల బాటలు నగదు మూటలకై
చూసేవారు అదిగో అక్కడవున్నారు
పదును ముళ్ళతో కరుకు రాళ్ళతో
ఇరుకు దార్లతో నరకం చూపే
ఏదారైనా ఫరవాలేదు నాకది చూపు
ఆ బాటలకి గమ్యం నువ్వైతే చాలు
ఆనందంగా నడిచేస్తా
పరుగు పరుగున వచ్చేస్తా

nandana vanaalu naakakhkharalEdu
sundara harmyaalu avasaramlEdu
attaru gandhaalu asalEvaddu
puula baaTalu nagadu muuTalakai
cuusEvaaru adigO akkaDavunnaaru
padunu muLLatO karuku raaLLatO
iruku daarlatO narakam cuupE
Edaarainaa pharavaalEdu naakadi cuupu
aa baaTalaki gamyam nuvvaitE caalu
aanamdamgaa naDicEstaa
parugu paruguna vaccEstaa

వేపచెట్టు కధ


నేస్తం నీకీ కధ చెప్పానా?

మాఇంట్లో ఓ వేపచెట్టుండేది
చేదు నిజాల చాయనిస్తూ
పరుల బాధలు తనలో నింపుకుని
ఇంటి పెద్దగా బయట నిలిచిన వేపచెట్టు కధ

బ్రతుకు భారానికి క్రిందికి వంగి
పిల్లల కోసం ఊయల అవుతూ
పక్షుల కిల కిల అంతా పంచే వేపచెట్టు కధ

ఆకు రాలినా పువ్వు రాలినా
కొన్ని కొమ్మలు పొయిలో కెళ్ళినా
వసంతమదిగో వచ్చేస్తుందని
ఆబగ చూస్తు అండగ నిలచిన వేపచెట్టు కధ

నేస్తం నీకీ కధ చెప్పానా?


nEstam neekee kadha ceppaanaa?

maainTlO O vEpaceTTunDEdi
cEdu nijaala chaayanistuu
parula baadhalu tanalO nimpukuni
inTi peddagaa bayaTa nilicina vEpaceTTu kadha

bratuku bhaaraaniki krindiki vangi
pillala kOsam uuyala avutuu
pakshula kila kila antaa pancE vEpaceTTu kadha

aaku raalinaa puvvu raalinaa
konni kommalu poyilO keLLinaa
vasantamadigO vaccEstundani
aabaga cuustu anDaga nilacina vEpaceTTu kadha

nEstam neekee kadha ceppaanaa?

ఏకాంతం


రాత్రి తలుపుతట్టింది
రోజు ఎంత వెలిగితే నే ?
ఓడి బయటకెల్లింది
ఏకాంతాన్ని కప్పుకుని
నాలోనేనే దూరిపోయాను
ఎప్పట్లాగానే !
నా కళ్ళ ముందే
జ్ఞాపకాల బండి మీద
నా అతీతం నన్నొదిలి
దూరంగా వెళ్ళిపోయింది
నిశ్శబ్దపు నిశీధుల్లోకి
నా స్వరం తప్పిపోయింది
కనురెప్పల సరిహద్దుపైన
కన్నీళ్ళే గెలిచాయి
చెక్కిళ్ళపై విజయ పతాకం
ఎగురుతోంది గర్వంగా
విరిగిన అద్దం ముక్కల్లో
ఆ చీకటి ముసుగులో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నా తలక్రింద కాలం
తడిసి కరిగిపోయింది
నా ఏకాంతం
నన్ను చూస్తుండగా
మళ్ళీ తెల్లారింది
తను మాత్రం నాతోనే వుంది.

raatri taluputaTTindi
rOju enta veligitE nE ?
ODi bayaTakellindi
Ekaantaanni kappukuni
naalOnEnE duuripOyaanu
eppaTlaagaanE !
naa kaLLa mundE
jnaapakaala banDi meeda
naa ateetam nannodili
duurangaa veLLipOyindi
niSSabdapu niSeedhullOki
naa swaram tappipOyindi
kanureppala sarihaddupaina
kanneeLLE gelicaayi
cekkiLLapai vijaya pataakam
egurutOndi garvangaa
virigina addam mukkallO
aa ceekaTi musugulO
nannu nEnu vetukkunTunnaanu
naa talakrinda kaalam
taDisi karigipOyindi
naa Ekaantam
nannu cuustunDagaa
maLLee tellaarindi
tanu maatram naatOnE vundi.

శుభోదయం


అనుభూతులను బంధాలతొ కట్టకు
అబద్ధపు అర్ధాలను ఆపాదించకు
స్వేచా విహంగాలై ఎగురనీ
అలుపొచ్చేలా ఆకాశపుటంచులు కొలవనీ
పరవసించి పరుగులెత్తే నదిలా
సుదూర తీరలను శోధించనీ
అలుపెరగ వీచే పవనాల్లా
ప్రతి గంధం ఆఘ్రాణించనీ
ప్రజ్వలించే అగ్నిహోత్రంలా
ప్రతి అణువూ తృప్తిగా మ్రింగనీ
గడిచే క్షణాల మాటే విననీ
నీ మనసు కోరేవే హద్దులవనీ
బాధలకది ఇక చరమ గీతం
అనుభూతులకది మరో శుభోదయం


anubhuutulanu bandhaalato kaTTaku
abaddhapu ardhaalanu aapaadincaku
svEchaa vihangaalai eguranee
alupoccElaa aakaaSapuTanculu kolavanee
paravasinci parugulettE nadilaa
suduura teeralanu SOdhincanee
aluperaga veecE pavanaallaa
prati gandham aaghraaNincanee
prajvalincE agnihOtramlaa
prati aNuvuu tRptigaa mringanee
gaDicE kshaNaala maaTE vinanee
nee manasu kOrEvE haddulavanee
baadhalakadi ika carama geetam
anubhuutulakadi marO SubhOdayam