మనసు కొండ మీది మందారాన్ని
పూజ వస్తువుగానే పొదువుకున్నాను..
నిరీక్షణలో కరిగిపోయిన కాలాన్ని
నీరాజనంగానే అద్దుకున్నాను...
నిన్ను కోరిన మనసు మధనను
ప్రసాదమంటూ సమాధానపడ్డాను..
తపన మిగిలిన తడికన్నులను
నిర్మాల్యమని తృప్తిపడ్డాను..
మాటల గారడీలో
పెదవుల వెనక నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన రెప్ప చూరుల
వెంట ఆవిరయిన ఆశ క్షణాలనూ..
గోటి మొనతో మీటి..
గుండె గుడిలో వెలిసిన దేవతకు
మంగళహారతి అనుకున్నాను.
గుండె గుడిలో వెలసిన దేవతకు మీ కవితా నివేదన బావుందండీ !
ReplyDeleteఅక్షరార్చన ...ఎంతందంగా చేశారు !
పరిమళం గారు ధన్యవాదాలు. అది అక్షరార్చన + అశ్రుతర్పణం = వీడ్కోలు.
ReplyDeleteగుండె గుడిలో వెలిసిన దేవతకు
ReplyDeleteమంగళహారతి అనుకున్నాను
మంగళహారతి పాడితే మళ్ళీ గుర్తుకొచ్చి కవిత రాయాలంటే కష్టమేమో ఆత్రేయ గారు..
భారారె గారు హహహ బాగుంది. అప్పుడు స్వాగత సుమాంజలి అనో, మళ్ళీ కురిసిన వాన అనో, అమృతం కురిసిన మరో రాత్రి అనో రాయొచ్చు.
ReplyDeleteప్రేమదూరమైతే పడే ఆవేదనను చక్కగా నివేదించారు....
ReplyDeleteమంగళం పాడేసాననుకున్నా! కానీ.....
ప్రతి ఉదయం, నీ శుభోదయమై
మధ్యాహ్నపు ప్రచండం నీ కోపాన్ని
సాయం నీరెండ నీ వలపుల తాపాన్ని
వెన్నెల రేయేమో నీ నవ్వుల జాలమై
ఆహ్......ఇలా, ప్రతీ క్షణం, నిన్నద్దం పడుతుంటే....
వాడిపోక ఎదను
గుదిబండయ్యిందా పూజా కుసుమం
కొన ఊపిరి గీతమై
రాగాలాపన చేసిందా నీరాజనం
ప్రసాదమని సమాధానపడ్డా
ప్రశ్నలడక మనసునుండేవా?
నిర్మాల్యమనుకుని తృప్తి పడ్డా
మృగతృష్ణవై మసక చేయకుండేవా?
ఇంతే...
ఈ గుడి గదింతే
ఈ గది గతింతే!
ప్రేమ పిపాసి గారూ ముందుగా.. చాలా బాగుంది మీ స్పందన. నా అబ్లాగుకు స్వాగతం. ప్రతిపదంలో విరహమూ నిరాశానింపేశారు. నా పాత మధురాలనూ చూసి స్పందిస్తారని ఆశ. మరింకే.. మీటండి మీ విరహ తంత్రులు.
ReplyDeleteచివుక్కుమన్న గుండే గుసగుసలాడినా కవిత్వమవుతుందని నిరూపించారు. ముక్కలయిన మనసులోకి తొంగి చూస్తే.. ఎన్నో బింబాలు కనిపిస్తాయి.. పలురకాలుగా వెక్కిరిస్తాయి. అందుకే.. అలా చూసుకున్న ప్రతిసారీ.. కంటిపాపలు కదిలి చెక్కిళ్ళమీద కవితలు రాలుస్తాయి.
ఇటుగా వచ్చి మీ స్పందనను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ప్రేమ అంటే ఇలా వుంటుందని కరెక్టుగా చెప్పారు. చాలా బావుంది.!
ReplyDeletebaaga chepparu..!
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteనిరాశలోనూ సుంతైనా ఆశుంది
ReplyDeleteఆ కాలాన అలజడి తప్పేం తెలిసింది?
మీ ప్రేమ గుడి బాగుంది.
ReplyDeleteవర్మ గారు, సుజ్జి గారు, పద్మార్పిత గారు, సృజన గారు ధన్యవాదాలు.
ReplyDeleteప్రేమ పిపాసి గారు గమనించారో లేదో.. ఆ అలజడి లో... అల, జల, జడి ఉన్నాయి.. అన్నీ చూడటానికి అందంగా ఉండేవే.. దూకితేగా.. లోతుతెలిసేది.. ఉక్కిరిబిక్కిరి చేసేది... బాగుంది మీ కామెంటు
అందరితో నేను ఏకీభవించలేక పోతున్నాను
ReplyDeleteఈ గుడి ప్రేమ గురించి కాదేమో? తనకు స్వంతం కావాలి అన్న కోరిక, కాలేకపోయినందుకు బాధపడుతున్నాను అని తెలిపే ఇది ప్రేమ గురించి కాదనిపిస్తుంది.
ప్రేమ ఒక భావన అనుకుంటా ...నచ్చింది, మెచ్చాను, ఇష్టపడ్డాను...ఇలా....ఒకరకమైన భావన.
దానికి "నాకే" అన్న స్వార్థం, "నాదే" అన్న అహం, "కావాలి" అనే వాంఛ ఇవన్నీ తోడైతేనే, అవి తీరకపోతేనే విరహాలు, వేదనలు, కన్నీళ్లు, మధనాలు, సమాధానాలు మొదలైనవి వస్తాయి కదా. కాబట్టి ఈ గుడి ఈ ఆహాల, స్వార్తాల, వాంఛ ల గుడి కాని ఉట్టి ప్రేమ గుడి మాత్రం కాదు.
ఇది ఆక్షేపణా స్వరంతో చెప్పటంలేదు.....ఉన్న దానిని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నానంతే.
ప్రేమ పిపాసి గారు .. బాగుంది మీ అభిప్రాయం.. మీ కోణంలోనుంచి మీరన్నది అక్షరాలా నిజం.. మీరన్న భావాలున్నట్టయితే ఇది ప్రేమ గుడి కానే కాదు..
ReplyDeleteనాకే అంటే స్వార్ధం..అన్నారు.. సరే... నేను నీకే అర్పితమూ అన్న భావముంటే ?
నాదే అంటే అహం .. అన్నారు... సరే... నేను నీవాడినే అన్న భావముంటే ?
కావాలి అంటే వాంచ .. అన్నారు .. సరే... నాదన్నది ఏమీ లేదన్న భావముంటే ?
నిజమే మీరన్నట్టూ ఆ భావాలు తీరక పోతే.. విరహాలు.. వేదనలు, కన్నీళ్ళు .. మిగులుతాయి.. నేను చెప్పిన భావాలు విరిగిపోయినా అవే మిగులు తాయి. మీరు చెప్పిన భావాలు ఉన్నప్పుడు అది ప్రేమ గుడి కాదు నిజమే...
అర్పణ.. నిస్వార్ధము.. ఆరాధన.. ఆత్మీయత..నిర్మోహము, ఉన్నప్పుడు అది తప్పకుండౌ గుడే అవుతుంది అని నా భావన.
మీరు ఆక్షేపణ చేసినా.. నేను తప్పు పట్టనండీ.. ఎవరి అభిప్రాయం వారిది.. ఈ కవిత మీలో ఇంత ఆలోచనను రేపినందుకు నాకు ఆనందంగా ఉంది.
మీకనిపించినది అనిపించినట్టు చెప్పవచ్చు.. నేరాసిన దాంట్లో తప్పూంటే .. దాన్ని అంగీకరించడానికి నేను వెనుకాడను.
ధన్యవాదాలు.
ఆత్రేయగారికి, నమస్కారములు.
ReplyDeleteమీ అభిమాన "ఆత్రేయకే" గుండెల్లో గుడికట్టిన మీకు మరొ ప్రేమగుడి కట్టటం పెద్ద కష్టమేకాదు. అభినందనలతో,
భవదీయుడు,
మాధవరావు.
maadhavarao gaaru dhanyavaadaalu
ReplyDeleteఆత్రేయ గారు,
ReplyDeleteనేనన్నది మిమ్మల్ని ఆక్షేపిస్తూ కాదు, మీలాగ ఇతరుల అభిప్రాయమేమిటో "ప్రేమ అంటే" అన్నదానిపై, తెలుసుకుందామనే ఆ ప్రశ్న, నా భావన ఏమిటో నాకు నేను చెప్పునేందుకే ఈ చర్చలు.
ఇకపోతే నిరీక్షణ ఎందుకు?
కోరతం ఎందుకు?
తపన, మధన ఎందుకు?
ఇవన్నీ మనని మనం అర్పణ అనుకుంటే ఉంటాయా?
రాధ మాధవునికి అర్పణ చేసుకున్నా తపన ఉంటే మాత్రం అది "కోరిక" తీరలేదనే కదా?
తనను తాను ఒకరికి అర్పించుకోటానికి ఇంకొకరి ప్రమేయం దేనికి?
వారి ప్రమేయం (దగ్గర ఉండటం, కలవటం, మాట్లాడటం, ప్రేమను అంగీకరించటం ఇలా ఏవైనా కాని)లేనప్పుడింక తపన, మధన, నిరాశా , దూఃఖం దేనికి?
కాకపొతే నేనేదో ఆ "స్వార్థాన్ని" ఆక్షేపిస్తున్నట్టు కాదు. అది సర్వ సాధారణం ప్రేమ అనే భావనతో పాటు.