
అస్థవ్యస్తం.. రణగొణధ్వనులు..
ఎపుడూ.. ఏదో వెదుకులాట ...
క్యాలికో ముసుగులో
ఆనాటి జీవితం..
విప్పారిన రెప్పలతో..వచ్చేసరికి..
చుట్టూ ప్రపంచం.. మాయమవుతూ..
బరువు శ్వాసనూ...బోలెడు నిశ్శబ్దాన్నీ
వదిలిపోయింది.
ఇంకి పోయిన ఇంకు మూటల్లోని
కలల దొంతరలు..
పుటల మధ్య రెక్కలై మిగిలిన
పువ్వు శిధిలాలు..
కవిత ముసుగులో ఒదిగిన
ఆశ ఖండాలు..
పిల్లలింకా పెట్టని నెమలి పించాలు...
మనసు మల్టీప్లెక్సుగా
మారిపోయింది.
తోడు రాలేని వసంతాలు...
ఆ తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.
"పిల్లలింకా పెట్టని నెమలి పించాలు..."
ReplyDeleteచిన్ననాటి ఆశ అలలుగా తాకిందండీ ...
మీ కవిత బావుందండీ !
nissabdham gaa caalaa maaTalu ceppindi mii kavita.caalaa baagundanDi
ReplyDeleteప్చ్ ఏ డైరీ చూసినా ఇదే వ్యధ జీవితాన సుఖమింతేనా అన్నట్లుగా. కాస్తైనా మార్పుంటే బాగుండును.
ReplyDeleteచిరునవ్వుల జల్లులూ
ReplyDeleteమనమాడుకున్న
ఆటల్లోని గిల్లి కజ్జాలూ
ఆపై అలకలూ,
అరచేత పూసిన
గోరింట కబురులూ,
విరబూసిన సన్నజాజుల
మధుర పరిమళాలూ,
చురుక్కుమనిపించే
నీ మాటల బాణాలూ,
తూటాలై పేలే
నీ చూపులు
నను మరపించే
నీ తలపులు,
మళ్ళీ నిను చేరాలనిపించే
నీ తుంటరి చేష్టలు
ఎన్నో మరెన్నో
కాగితాల నడుమ
పవళించి, తెరిచిన
ప్రతిసారీ ఎగసి పడే
జ్ఞాపకాల ఉరవడి
తోడు రాలేని వసంతాల
తెరల మధ్య ఆల పించిన
మేఘమల్హరి చెవులకు చేరేలోపే..
కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే..
తిరిగి వస్తానంటోంది..
మరోసారి శ్రుతి చేసేటందుకే..
గురువు గారు! చివరి భావాలు మీవే. చెప్పకుండా వాడేసుకున్నాను, మన్నించేయండి. ఎంతైనా మీ అడుగుల్లో నడస్తున్న శిష్యులం కదా.
ఒకసారి మీ టపా చూసి పని మొదలు పెడదామని వచ్చాను. అనుకోకుండా ఇలా వ్రాసేశాను. ఇది తప్పా? ఒప్పా? ఏమో! అనిపించింది చెప్పేశాను.
ReplyDeleteపరిమళం గారు ధన్యవాదాలు.. ఇలాంటి అలలెన్నో.. ప్రతికాగితంలోనూ.. ఏమంటారు.. ?
ReplyDeleteరాధిక గారూ ధన్యవాదాలు.. ఒక్కోసారి.. నిశ్శబ్దమంత ధ్వని ఉందదనిపిస్తుంది... మనసు పిండి కష్టపెట్టినా.. దానికి ఊరటనిచ్చి లాలించినా దానికే చెల్లుతుంది.
ఉష గారూ ధన్యవాదాలు. నిజమే.. మనము మనసు చివుక్కుమన్న సంఘటనలనే ఎక్కువగా.. గ్లోరిఫై చేసి మన కాగితాల్లోనూ.. కవితల్లోనూ రాసుకుంటామేమో.. అందుకే.. ఏ డైరీ చూసినా ఏమున్నది గర్వ కారణం.. పొగిలిన ఘటనలు.. పగిలిన గుండెలు అంటాను.. (శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో )
శ్రుతి గారు.. ఇక చెప్పేదేముంది.. చాలా బాగా రాశారు. అభినందనలు.. అయ్యో ఇందులో తప్పా ఒప్పా.. ఏముందండీ... అనిపించింది ఎప్పుడూ చెప్పొచ్చు.. చెప్పాలి కూడా..
నిజంగా మీరు వాడే పదజాలాల్లో మనిషి మెచ్చే మహిమ కనబడుతున్నది. పరమార్థాన్ని అందిస్తున్నవి. కవితల్లో తెలుగు భాష పరిపూర్ణత్వం మమ్మల్ని ముగ్దుల్ని చేస్తున్నది.
ReplyDeleteఆత్రేయ గారికి, నమస్కారములు.
ReplyDeleteకవిత చాలా బాగున్నది. అయితే, నా e-mail ని మాత్రం మీ డైరీలోని పుటల్లో ఇంకిపోకుండా చూడండి.
భవదీయుడు,
మాధవరావు.
maadhavarao gaaru dhanyavaadaalu
ReplyDelete"పిల్లలింకా పెట్టని నెమలి పించాలు..."
ReplyDeleteఇది చదివి నా బాల్యనికి వెళ్లొచ్చాను
కవిత చాలా బాగుంది.
గతమెంత తేయనో కదా....!? :)
వర్మ గారు ప్రేమికుడుగారు ధన్యవాదాలు.
ReplyDelete