Friday, July 17, 2009

మరో ప్రపంచం


అదిగో అదిగగిగో .. మరో ప్రపంచం

విధి మలిచిన మూసల నుండీ..
ఆశగా కొరికిన గాలాలనుండీ..
తపన చుక్కాని మలుపుల నుండీ..
తీరం చేర్చని గుండాలనుండీ..

ఒక్క సారిగా..తప్పించేందుకు..
అర్రులు చాచి పరుగు పరుగున..
అదిగో .. మరో ప్రపంచం..

అశ్రు రహితం, సర్వ హితం
శాంతం.. శ్యామలం..
అదిగో .. మరో ప్రపంచం..

నిశ్శబ్దం, నిర్మోహం, నిశ్చలం
నిర్మలం. నిర్వాణం..
ఆహా మరో ప్రపంచం..

అందరి వైపుకా గమ్యపు పయనం..
వస్తోందంటే భయాలు ఎందుకు ?

కలల తెప్పపై దాటిన రాత్రులు..
రెప్పలు పూసిన ఆశల మూటలు..
అన్నిటి నుంచి విముక్తి అదిగో..

మరో ప్రపంచం మరో ప్రపంచం..

3 comments:

  1. చాలా బాగుంది.

    ReplyDelete
  2. ఆత్రేయగారూ...మీకలానికి లేవండి హద్దులు...
    బహుత్ ఖూబ్....బొమ్మ బహుత్ బహుత్ ఖూబ్!!!

    ReplyDelete
  3. అమ్మో! బాగుంది మీ కవితామాల...కాదు కాదు కవితా బ్రిడ్జ్ అనొచ్చాండి?

    ReplyDelete