Friday, June 26, 2009

ఆ సాయంత్రం..



రేగిన ప్రతి కెరటానికీ
కర్పూరమయ్యే
క్రింద అస్తిత్వం,

చేతికి రాని నీడ
వేసిన కాళ్ళ బంధం,

గుండెకు కాషాయమద్దుతూ
బరువు గాలి హోరు..

సాయంత్రం..

కిరణాలు విరిగి కృంగుతూ
చేతన విదిల్చిన జ్ఞాపకాలు
ఫీనిక్సు పక్షులై
నన్ను గెలుస్తున్నాయి !



3 comments:

  1. కవితలోని భావం చిత్రంలో కదలాడుతోంది ...చాలా బావుందండీ !

    ReplyDelete
  2. ఆలోచనలు ప్రకృతి లోని పక్షుల్లా
    ఆంతర్యం దానిలోని అందమైన రంగుల్లా
    ఆలాపనల ఉద్దీపనలు అలల్లా
    అందంగా ఉరకలేస్తూ హృదయాంతరంగాల్లో
    అద్బుతంగా అన్నివేళలా చిత్రించుకుపోతున్నాయి.
    అలవోకగా ఆనందం హాయిని కలిగిస్తున్నాయి...

    చెప్పటానికి రావటంలేదు ఏమీలేదు, కానీ మీ కవితలు ప్రేరేపిస్తున్నాయి.
    భావాలు మహా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. చాలా బావున్నయండీ.!!

    ReplyDelete
  3. వర్మ గారు పరిమళం గారు ధన్యవాదాలు.

    ReplyDelete