నేనోడిపోయాను..
తెలియలేని దారుల్లో తచ్చాడడానికిఏ కాంతి తీగలూ వంచలేను..
తడి కంటి కాంతి ఇప్పటికేఅపభ్రంశమయ్యింది.
నావి కాని గాయాలకిఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన పాదాల క్రిందవిధి అరిగిపోయింది.
చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందేయాతమేదైనా తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
ఇకనైనా నా తోడు కావాలి.
నేనోడిపోయాను..
నీ జోడు కావాలి.
గురువు గారూ!
ReplyDeleteమీరు ఓడిపోయినట్లు లేదు కాని తన గెలుపు కోసం తల వంచినట్లుంది. మీకో విషయం చెప్పనా? ఓడిపోయానని ఒప్పుకోవడం కుడా గెలుపే ( అది మన అహంపై)
నేనోడి పోయాను, నీ జోడి కావాలి అంటే వస్తారా? ఎమో? చూద్దాం
జోడీ కట్టే తోడూనీడల నడుమ గెలుపు వోటములు వుండునా, అవి కల్పించగ విధి కైనా సాధ్యమా?
ReplyDeleteనేనోడిపోయాను..నీ జోడు కావాలి.
ReplyDeleteఅని నువ్వడుగుతుంటే ...
మాటరాని మౌనం నా భాషయ్యింది ...
కవిత చదువుతుంటే ..నాకే తెలియకుండా
చెమర్చిన గుండె నాకు తోడయ్యింది !
బావుంది గురువుగారూ !
ఓటమి గెలుపు కి నాంది కదండి.There is a silver lining for every dark cloud అని కూడా అన్నారు .కాబట్టి మీ ఓటమి వెనుక ఏ గెలుపు దాగుందో..
ReplyDelete"నీ నీడలోని జవస్త్వాలు..
ReplyDeleteఇకనైనా నా తోడు కావాలి." ఈ అనుభూతి అదిరింది.
శ్రుతి, ఉష, పరిమళం, తృష్ణ, మహేష్ గార్లకు ధన్యవాదాలు.
ReplyDeletebeautiful
ReplyDeleteఆత్రేయగారికి, నమస్కారములు.
ReplyDelete"నేనోడిపోయాను" : కవిత బహు గొప్పగా వున్నది.
మీ "కవితా కాంతి తీగలను" మా ఇంటివరకు వేయగలిగితే, నా "రాధమాధవ్ గద్య కవితలకు" కలిపి, నా కవితలను కూడా మరింత కాంతివంతంగా చేసుకుంటాను. అభ్యర్ధనను స్వీకరించండి.
భవదీయుడు,
మాధవ రావు.
just now i saw ur blog. it takes time to go through. it seems it has much depth. chadivinaaka malli chepta .
ReplyDeleteమాధవ రావ్ గారూ ఆ తీగెలు ఎప్పుడో మీ ఇంటి వరకు వేశానండీ.. కానీ వచ్చిన ప్రతి సారీ.. వెలిగించడానికి బల్బులు మర్చి పోతాను.. (కామెంటడం అన్న మాట) .. మీ అన్ని కవితలు చదువుతానూ. కానీ కామెంటు పెట్టడానికి బద్ధకిస్తాను. ఈ సారి తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు.
ReplyDeleteజయ భారతి గారు.. స్వాగతమండీ.. నా బ్లాగుకు మొదటి సారి వచ్చారు.. కాస్త చాయి కాఫీ తీసుకుంటారా .. ? :-) take your own time.. appreciate your coming and taking time to comment
బాబా గారు ధన్యవాదాలండీ.
అయ్యో జయభారతి గారు. వెటకారమ్ ఏమీ లేదండీ.. ఊరికే సరదాకి అన్నదేనండి. మీరు మరీ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. క్షమించాలి.
ReplyDeletenenuu saradagaa ne cheppananDi no kshamainchatalu vagaira vagaira lu.. carry on
ReplyDeleteAWESOME
ReplyDeleteకాలంతో తిరిగిన పాదాల క్రింద
ReplyDeleteవిధి అరిగిపోయింది.నేనోడిపోయాను..నీ జోడు కావాలి.
కవిత చదువుతుంటే మీరు మరీ సున్నిత మనస్కులనిపిస్తుంది.