కంటి పాపల క్రింద
పొత్తిళ్ళను సర్ద్దేస్తూ
దీపాల ముంగిట్లోకి
బలవంతంగా..
మెల్లగా వీస్తూ..
రాత్రి వదిలిన
రెప్ప-బరువు,
కాలక్షేపం..
వేలుకంటిన కాంతి గింజలూ ...
పొగచూరిన ఆకాశమూ,
గొలుసులిప్పుకుని కదిలిన కాలం,
రంగులై పగిలిన ఆశలను
అవలోకిస్తూ..
సంధ్య శబ్దాల కంపలోకి,
అ ఇష్టంగా అడుగులేస్తూ..
very nice
ReplyDeleteబాగుందండి....
ReplyDeleteకవితాబాణి పట్టుకోవడం అసలునాడి తెలుసుకోవడం ఈసారి ఆలోచనా పూరితమే!! nice one,
ReplyDeleteఇలా భావాన్నివివరించగలిగే ఒక శైలి చాలారోజులతర్వాత చూడగలిగాను.
కవిగారు మీకు జోహార్లు....
మీరు కవితల్లో చూపిస్తున్న టాలెంట్ చాలా నచ్చింది.
బాబా గారు, పద్మార్పిత గారు ధన్యవాదాలండీ.
ReplyDeleteవర్మ గారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. బాబా గారి లాంటి ఎందరో పెద్దలు అనుభవిజ్నుల రచనా శైలి, వారి కవితలు, సలహాలు నాకవితలు మెరుగవడానికి. ఎంతో సహాయపడుతున్నాయి. వారికి సదా నా కృతజ్నతలు.
ఆత్రేయ గారు
ReplyDeleteమరీ అంత ఎక్కించేయ్కండీ. నేనూ మీ లాగే ఔత్సాహికుడనే.
సుబ్బుగారి బ్లాగులో మీ కామెంటు చూసాను.
అందులో మీరేమీ అనుచితంగా వాఖ్యానించినట్లు నాకేమీ అనిపించటంలేదు. మీరు అనవసరంగా ఫీల్ అయినట్లున్నారు.
ఒక వేళ నేను మిమ్ములను అలా అనిపింపచేస్తే క్షంతవ్యుడను.
ప్లీజ్ టేక్ లైట్
బొల్లోజు బాబా
నిన్నటి ఊసులకు
ReplyDeleteరేపటి ఆశలకు
కొత్త సొగసుల
పుప్పొడి రేకులద్దుతూ
ముస్తాబై వచ్చింది మరో ఉదయం
కంపలో పూచినా
కనులకింపుగా
మది మరపించే
మమతల సువాసనలతో
మరో సారి పూసిందీ ఉదయం
ఏమంటారు గురువు గారూ!
తప్పైతే మన్నించడి.
బావుందండీ ...ఎప్పటిలాగే !
ReplyDeleteవద్దనుకున్న మీ ఉదయం ....ఆహ్వానిస్తున్న శ్రుతిగారి కవిత కూడా బావుంది .
ఆత్రేయగారికి, నమస్కారములు.
ReplyDelete"వద్దునకున్న ఉదయం" : వద్దునకున్నా, నా కంటిపాపలు, మీ కవితా పొత్తిళ్ళవైపే చూపును ప్రసరిస్తున్నాయి. అతి సహజమైన పదాలను మృదువుగా మీ కవితలో అద్దారు. అభినందనలు.
భవదీయుడు,
మాధవ రావు.
శృతిగారు మీకు ఎంచిమరీ మీకై పంపించిన మంచి ఉదయాలన్నీ అందినాయన్నమాట సంతోషం. చిన్నిచిన్ని వాక్యాల్లో చిచ్చరపిడుగులేశారు. దాంట్లో తప్పేముందండీ.. నా తెగిన తీగల ఆలాపనలను మీరిలా వచ్చి శృతి చేయడం చాలా సంతోషం. ఆపైన వెదజల్లబడ్డ పరిమళాలు. అబ్బో బంగారానికి తావి అబ్బినట్టుంది. మీ ఇద్దరికీ ధన్యవాదాలు
ReplyDeleteబాబాగారు లైటు తీసుకున్ననండి. ఇక నేను ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. మన భావుకులకుండే బాడ్ హాబిట్టేఇది. ఊరికే ఇదైపోతాము.. ఏమైనా థాంక్సండీ.
మాధవరావ్ గారు. చాలా రోజులకు వచ్చారు. ధన్యవాదాలండీ.
namaskaramandi,
ReplyDeletechalabagundi andi mee kavitha nenu chala late ga vichhesanu me blog ki
alage na blog ki kuda vichhesi mee amulyamina coments ivvagalarani ashisthu
untanu andi.
http://mirchyvarma.blogspot.com
meeru rasina kavitalalo bhavam sahajanga ,,,sahajatwaaniki maro rupamga anipistunnadi naku
ReplyDelete