Tuesday, June 9, 2009

మూగ ప్రేమ

(ఈ చిత్రము http://emsworth.wordpress.com/tag/willard-metcalf/ నుండి గ్రహించబడినది.)

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…


పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ .

1 comment:

  1. same added over there at the link given above.

    వలదన్న వినని నీ మనసు
    తనకు తాను బందీ అవుతుంటే
    తొంగిచూసిన నన్ను చెదరగొట్టింది నువ్వు
    నాకు తెలియని తావుకి తోసుకెళ్ళిందీ నువ్వు
    తిరిగి రారమ్మని కంటినీరువిడిచింది నువ్వే
    ఇన్నిటా మూగనై నీ వర్ణనలో మునిగిందీ నేనే…

    ReplyDelete