అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలో
రాత్రి మరకల్ని కడుక్కున్న మరో ఉదయం
తడిసిన మందారంలా, నిర్మలంగా
బాహ్యాకాశంలో బరువుగా పూస్తుంది.
కలల కౌగిలిలో వెలిగి ఆరిన
కంటి కాగడాల మధ్య
వీర తిలకం దిద్దిన కాంతి చేతులు..
నల్ల కాలాన్నీ కాళ్ళకు కట్టి
మరో యుద్ధానికి సిద్ధం చేస్తాయి
దరిలేని తీరాలు, తీరని దాహాలు
అలుపెరుగని అలల మధ్య
ఊతమిచ్చే చేతికోసం
ఎదురు చూపులతో.. నిన్నటిలానే
పోరాటం ముగుస్తుంది..
ఆరాటమారుతుంది.
అలిసిన దేహానికి చీకట్లు చుట్టుకుంటూ
స్థబ్ద నిశీధిలోకి చేతన నిష్క్రమిస్తుంది
భారమైనదే అయినా బాగుంది.
ReplyDeleteమరుసటి రోజుకై మరొక పోరాటం సాగిస్తుంది....
ReplyDeleteబాగుందండి...
అరుదెంచిన ఉదయాన్ని అర్థించినా,
ReplyDeleteరానున్న నిశిరాత్రిని ప్రార్థించినా,
ఆకలిదప్పులు లేని లోకాన్ని వెదికివ్వగలవా?
ఆర్తనాదాలు లేని అమరగానం భువిని వినిపించగలవా?
శృజన గారు ధన్యవాదాలు. స్వాగతం.
ReplyDeleteపద్మార్పిత గారు.. నిజమే ఆఖరి పంక్తి అలా రాసిఉంటే బాగుండేది. ధన్యవాదాలు.
ఉష గారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే.. అన్నదే ఈకవితా హృదయం. థన్యవాదాలు.
ఎన్ని విప్లవాలు వచ్చినా ఈ ఆకలి మంటలు ఆగవు
ReplyDeleteఎన్ని మార్పులు సంభవించినా అలసిన హృదయాలు స్పందించజాలవు
కధాసాగర్ గారు నా బ్లాగుకు స్వాగతం. నిజం చెప్పారు వచ్చిన విప్లవాలు, చేసిన ప్రణాళికలు ఏ మ్యూజియం బీరువాలోనో భద్రంగా ఉంటాయి.. నిజజీవితం నోట మట్టే.
ReplyDeleteఆత్రేయ గారికి, నమస్కారములు.
ReplyDelete"కాల చక్రం" కవిత చాలా బాగుంది. కవిత చదువుతున్నప్పుడు కలిగిన భావన తొలకరి వానలకు తడిసి, పరిమళించే మట్టి వాసనలాగా, నిత్య,సత్యమైనదిగా అనిపించింది.
భవదీయుడు,
మాధవ రావు.
ఆత్రేయ గారికి, నమస్కారములు.
ReplyDelete"కాల చక్రం" కవిత చాలా బాగుంది. కవిత చదువుతున్నప్పుడు కలిగిన భావన తొలకరి వానలకు తడిసి, పరిమళించే మట్టి వాసనలాగా, నిత్య,సత్యమైనదిగా అనిపించింది.
భవదీయుడు,
మాధవ రావు.
మాధవరావ్ గారు మీ కామెంటు రెండు సార్లు చెప్పి మీ అభిమానం ద్విగుణీకృతం చేశారు. ధన్యవాదాలు ధన్యవాదాలు. నిప్పులా కాల్చే సత్యాలు, కాలంతో కలిసి కాటేస్తున్న విషయాన్ని.. కాస్త మట్టిపూసి మారేడు కాయ చేశాను. అది తడిసిన వాసన మీకు బానే గుబాళించిందన్నమాట. ధన్యవాదాలు.
ReplyDelete