Saturday, May 30, 2009

తనెళ్ళిపోయింది..

తనెళ్ళిపోయింది..

ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..

కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..

అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..

10 comments:

 1. మునుపు మాటలు గుర్తు రాలేదన్నాను, ఇపుడు తానెళ్ళాక ఇలా మాటల్లో మునిగిపోయిన మిమ్మల్ని వెలికి తీసే మాటలు దొరక్క వెదుక్కుంటున్నాను.

  ReplyDelete
 2. ఎక్కడికి వెళ్ళుతుందండి!!!
  మీ ప్రతి కదలికలో నానుంది చూడండి!!!

  ReplyDelete
 3. Didn't this appear somewhere else? Sounds familiar!

  ReplyDelete
 4. బ్లాగు మిత్రులు క్షమించాలి. ఈ కవిత పొద్దులో ప్రచురించకముందు రాసుకున్న కవిత. వేరే కవితను అప్లోడు చేయబోయి మళ్ళీ అదే కవితను అప్లోడు చేశాను. అలవాటులో పొరపాటు.

  కొత్తపాళీ గారు మీరిది పొద్దులో చూశారు.. అక్కడ వ్యాఖ్య కూడా చేశారు.

  మరో సారి క్షమాపణలు.

  ReplyDelete
 5. హమ్మయ్యా, వ్యాఖ్య వ్రాసాకా అయ్యో ఎందుకిలా తప్పిదం చేసాను, మళ్ళీ చదివితే ఏం పోయింది కదా అననుకున్నాను. మొత్తానికి నా శ్లేష [మునుపు మాటలు గుర్తు రాలేదన్నాను, ఇపుడు..] మీకు అర్థం కాలేదన్న మాట! పొద్దులోనూ నా వ్యాఖ్య వుందండోయ్. మరేం చేయను చెప్పండి, అవకాశం దొరికితే చెడుగుడాడేయటం అలవాటు. ;)

  ReplyDelete
 6. మాటలు రాని మనసు భాష అమ్మబాబోయ్ ఎంత బావుందో..రియల్లీ అధ్బుతం.!!!

  ReplyDelete
 7. చాల సున్నితం గా వుందండి...

  ఒకేసారి.. ఆనందాన్ని అనుభవిస్తున్న అనుభూతినిస్తూనే..దూరమైపోతోందని..చెప్పేసారు..

  వాఆ....నేను క్రయింగ్...

  థాంక్స్ ఆత్రేయ గారు..

  ReplyDelete
 8. (NTR gaarini Osaari gurtu teccukOnDi.. dialog baaguntundi) ఊరుకోండి శివగారు ఊరుకోండి. కష్టాలు పీపుల్ కి కాకపోతే ప్లాంట్లకు వస్తాయా? హ్హ గోటితో పోయే చుక్కకోసం గొబ్బెమ్మై కూర్చుంటారా.. ఇకచాలు లేవండి.

  సరదాగా అన్నదే సీరియస్ అయిపోకండి. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

  ఉష గారు, వర్మగారు చాలా ధన్యవాదాలు

  ReplyDelete
 9. suryudu vellipoyadani chandamama rakunda untunda,
  gadichipoyedi kalamokkate, danini teesukuralememo, kavitha kadilinchali manasunu manishini meela nenu rayalante emi cheyyalo chepparu

  ReplyDelete
 10. అనానిమస్ గారు ధన్యవాదాలు. మీ ఆశావాదం బాగుంది. మరొకరిలా రాయాలి అని ఎప్పుడూ చూడకండి. మీరనుకున్నది మీలానే రాయండి.. రాస్తూఉండండి. నిదానంగా మీకొక శైలి అమరుతుంది. నేనూ పెద్ద రచయితనేమీ కాదండీ.. నేనూ మీలాంటి వాడినే.. తేడా ఒక్కటే.. నేను రాస్తున్నాను మీరు ఇంకా మొదలెట్టలేదు... అంతే.. ఇక రాయండి మరి..

  ReplyDelete