Monday, March 30, 2009

వేటగాడినా.. ?


ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..

ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

నా ముళ్ళపైనే నీ కళ్ళు.. 
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


వేటగాడినా.. ? 
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. 
పండుటాకును నేను... 
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న 
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా 
నా గత జ్ఞాపకాల కంపను నేను..


పరిమళం గారు రాసిన కవితకు నా స్పందన
http://anu-parimalam.blogspot.com/2009/03/blog-post_30.html


10 comments:

  1. Chakkagaa vundi...aame nannu ardham chesukoledu ane kadaa.... mee arthdham...:)

    ReplyDelete
  2. అవును శివ గారు.. నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. పరిమళం గారి కవిత దానికి మీ స్పందన రెండూ చాలా బాగున్నాయి

    ReplyDelete
  4. హహ ఇప్పుడే పరిమళం గారి కవితను చదివి వస్తున్నాను .. చాలా బాగా రాసారండి

    ReplyDelete
  5. ధన్యోస్మి గురువు గారూ !

    ReplyDelete
  6. కవితకి మీ స్పందన బహుబాగు....
    ఒకరికొకరు అన్నట్టుగా ఉంది....

    ReplyDelete
  7. చాలా బాగుందండి...

    ReplyDelete
  8. విజయమోహన్ గారు, నేస్తంగారు, పరిమళం గారు, పద్మార్పిత గారు,చైతన్య గారు మీకందరికీ కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. Aatreya garu, I want you to have a look at my reaction to Parimala gaaru's poem. I tried my best but sure could not reach the beauty you created. Experience makes all the difference. Your poetry is guillotine blade-edge-shining and knife-sharpness!

    http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_31.html

    ReplyDelete
  10. aanaMd gaaru thanks for ur complements. I have seen ur kavita. it is very good. keep going.

    ReplyDelete