Tuesday, March 31, 2009
నీదీ ఓ బ్రతుకేనా ?
నీదీ ఓ బ్రతుకేనా
ముఖాన అచ్చేసిన అవే
పన్నెండు ఘటనలేగా..
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా ?
ఐనా గడిచిన ప్రతి ఘటననీ
గర్వంగా గంటకొట్టి మరీ చాటిస్తావ్
చీకటి వెలుగులయి సమానంగా సాధిస్తావ్
ఎన్ని బ్రతుకుల వర్తమానలని
మింగి గతింప చేస్తావ్ ? విగత జీవుల్ని చేస్తావ్ ?
ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావు?
ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్ ?
నీదీ ఓ బ్రతుకేనా ?
కర్కశ మైన నీ ముళ్ళ ముఖాన్ని
గోడకు శిలువేసినా..
సుడిగుండంలా తిరుగుతూ
ప్రపంచాన్ని కబళిస్తావు ..
అవిశ్రాంతంగా.. అందరి బ్రతుకు వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు
నీదీ ఓ బ్రతుకేనా .. ?
నువు దాటిపోయేదాకా
నీ ముఖన్నెందుకు దాటేస్తావు ?
వస్తున్న అలికిడినీ ఎందుకు దాచేస్తావ్ ?
పిరికి పంద ... ఎదురొడ్డి ఓడిస్తామనేగా ..?
నీదీ ఓ బ్రతుకేనా ?
Subscribe to:
Post Comments (Atom)
కాలాన్నే నిలదీసారే!
ReplyDeleteమీ ఆలోచనా అద్భుతంగా ఉంది.
కవిత చాలా బాగుంది.
యాండోయ్
ReplyDeleteకైత బాంది మారాజా.
ఒక్క మాట్జెప్పి ముగిత్తానండే. కాలానికి, టయానికి ఎదురొడ్డే మొగోడు, మొనగాడు సరిత్రలోనే కాదండే, బయిష్యత్తులో కూడా పుట్టడండే. రేపటి బయిష్యత్తే ఆ మలిపొద్దుకి సరిత్ర కదండే. మొనగాడు కాపోతే మొనగత్తె వత్తాది అంతారా, అల్లా జరిగిన రోజండే టయాల్లో తేడా వచ్చేత్తాదండే, ఆగిపోతాయండే. అపుడు మీకు ఎవ్వురినీ "నీదీ ఓ బతుకేనా" అని నిల్దీయక్కరలేదండే.
ఇంగో మాటండే, నిన్నటేళ మీరు మాగంటాయన్ని గుర్తుచేసారు కదోండే . ఆయన బాకీ ఒకేడాది తర్వాత తీర్చగలిగానండే. మీకు సెప్పాలి అనిపించిందండే. అదండీ మారాజా.
మీ కవిత చాలా బావుంది.
ReplyDeleteభవాని గారు సురేష్ గారు ధన్యవాదాలు.
ReplyDeleteదిన్నెలవారు.. బాచెప్పారు. ఆడలేనమ్మ ఏదో అందిట అదే నా పరిస్థితీ.. ఏనుగుచూసి కుక్క మొరిగిందిట.. దాన్ని గెలిచేద్దామనే.. నాదే అదే పరిస్థితి. ఏమీ చేయలేనమ్మ అక్కసు వెళ్ళగక్కిందని.. అదే నా పరిస్థితి. కాళిదాసు కవిత్వం కొంచెం నా పైత్యం కొచెం అన్నట్టు, నాకు కొచ్చిన భావాన్ని చేతనయినంత మేర కాగితం మీద పెట్టాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అయినా.. కాలమాగుతుందా.. నా కసి తీరుతుందా..
బాగుంది ఆత్రేయ గారు.
ReplyDeleteబారారె గారు ధన్యవాదాలు
ReplyDeleteఎంత అద్భుతమైన ఆలోచన..!
ReplyDeleteచాలా చాలా బావుంది. అందరూ ఎప్పుడూ కాలం సాగిపోతూ ఉంటుదని. ఎవరికోసమూ ఆగదు.. లాంటి జాలితో కూడిన మాటలనే ప్రయోగిస్తుంటారు.
ఇలా నిలదీయడం అనేది సరి కొత్త ప్రయోగం.
మీకు ఒక చిన్న ప్రశ్న..
ఇంతకీ.. మీ కవితల్ని ఏవైనా పత్రికలకి పంపిస్తారా ఎప్పుడైనా?
ఇంకా ఎక్కువ మందికి చేరువైవౌతాయి కదా అలా చేస్తే..
ఇంటర్నెట్ పత్రికలైన కౌముది, పొద్దు లో నైనా వేయచ్చుగా..
మధురవాణి గారు ధన్యవాదాలు. ఇంతకు ముందు ఓక కవితను పొద్దు కు పంపించాను వారు ఆదరించి దానిని ప్రచురించారు కూడా. ఆ తరవాత పంపించలేదు. ఏమో ఆ తరవాత ఆ ఆలోచన రాలేదు. మీఆదరణకు అభిమానానికి మరోసారి ధన్యవాదాలు.
ReplyDelete"అవిశ్రాంతంగా.. అందరి బ్రతుకు వెనక
ReplyDeleteఅగాధాలను తవ్వుతూనే ఉంటావు" బావుందండీ !
parimaLam gaaru sujji garu dhanyavaadaalu.
ReplyDeleteఆత్రేయ గారూ!
ReplyDeleteకాలాన్ని నిలబెట్టి మరీ కడిగేసారు. "కవయః నిరంకుశాః" అని ఊరకే అనలేదు పెద్దలు. కాలాన్ని సైతం నిలదీసే హక్కు - దమ్మున్న మీలాంటి కవికే చెల్లుతుంది. అభినందనలు!
ఈ కవితను ’ఆంధ్ర జ్యోతి’ లేదా ’వార్త’ - ’సండే స్పెషల్’ లో ప్రచురణకు పంపండి.
- డా. ఆచార్య ఫణీంద్ర
aacaarya varya dhanyavaadamulu. tapppaka pampistaanu.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteచాలా అద్భుతంగా ఉంది కవిత
ReplyDeleteఆనంద్ గారు మీ కామెంటు అందింది. మీకు త్వరలోనే ఈమేయిలు పంపుతాను. ధన్యవాదాలు.
ReplyDeleteనేస్తం ధన్యవాదాలు.