Tuesday, February 17, 2009

అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

చిరుగాలికి రెపరెప లాడుతు
నీ కళ్ళకు అడ్డంపడుతు
నా చూపుతొ దోబూచాడే
ఏ కడలి ఎరుగని నీ కురుల అలలకు
అడ్డం కట్టు..

చెప్పేందుకు తికమక పడుతు
నీ మాటలు తడబడనిస్తు
నా మనసును గిలిగింతెట్టే
ఏ తుమ్మెద ఎరుగని మధు కలశాలను
అదుపులో పెట్టు..

చిరు సిగ్గులు కురిపించేస్తూ
సంధ్య కాంతులు విరజిమ్మేస్తూ
మనసు భావాలకు అద్దంపట్టే
ఏ ముఖము ఎరుగని నీ చెక్కిలి అద్దము
దూరం పెట్టు...

అల్లలాడుతూ కవితలు రేపుతూ
అలకకి కూడా అందానిస్తూ
మనసు హాయిలో ఓలలాడించే
ఏ నింగి ఎరుగని తారలా కన్నులు
అబ్బ! ... అవతలికి తిప్పవూ..

చెలివని నీకు చనువును ఇస్తే
చేసే చేష్టలు అన్నీ చేస్తూ
నేనేం తప్పుని చేశానంటూ
అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

==================================


cirugaaliki reparepa laaDutu
nee kaLLaku aDDampaDutu
naa cuuputo dObuucaaDE
E kaDali erugani nii kurula alalaku
aDDam kaTTu..

ceppEnduku tikamaka paDutu
nee maaTalu taDabaDanistu
naa manasunu giliginteTTE
E tummeda erugani madhu kalaSaalanu
adupulO peTTu..

ciru siggulu kuripincEstuu
sandhya kaantulu virajimmEstuu
manasu bhaavaalaku addampaTTE
E mukhamu erugani nii cekkili addamu
duuram peTTu...

allalaaDutuu kavitalu rEputuu
alakaki kuuDaa andaanistuu
manasu haayilO OlalaaDincE
E ningi erugani taaralaa kannulu
abba! ... avataliki tippavuu..

celivani neeku canuvunu istE
cEsE cEshTalu annee cEstuu
nEnEm tappuni cESaananTuu
amaayakamgaa aa praSnalEmiTi ?

5 comments:

  1. నేనేం చేశానూ?
    అయినా నువ్వాడల్సిన ఆట
    చిరుగాలి ఆడిందని ఉక్రోషమా?

    అద్దం లాంటి చెక్కిలిలో
    నీరూపం కనిపిస్తుందని కినుకా
    లేక ఆ రూపం లో కలిసిన నాపై అలుకా?

    నా కళ్ళలో నీ బొమ్మకు
    మరికాస్త సొగసునద్దాలని వచ్చిన
    చందమామ పై కూడా కోపమేనా?

    ReplyDelete
  2. మీరు ఇంత అందంగా వర్ణిస్తే అమాయకత్వంతో పాటు వయ్యారాలు కూడా పోతుంది మీ చెలి(మన్నించాలి మీ మధ్య తలదూర్చినందుకు.
    Beautyful....

    ReplyDelete
  3. చాలా బాగుంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. తరువాత అసూయ కూడా కలిగింది. నాకు కూడా చెప్పదానికి చెలి కావాలని మీకా అదృష్టం వుందని
    శేషశాయి

    ReplyDelete
  4. చెలి అలకని..అందాన్ని ఇంత మురిపంగా వర్ణిస్తుంతె తెలికుందానె పెదవులపై చిరునవ్వు పూచింది...

    nice one.

    ReplyDelete
  5. శృతి గారు మంచి ప్రశ్నలే వేశారు.మూడూనూ !!:-)

    పద్మార్పిత గారు నిజమే ఆ వయారాలను చూడాలనుకునే లోపల మీ తల అడ్డం వచ్చింది. మరోసారి ప్రయత్నిస్తాను ఏంచేస్తాం.

    శేషశాయి గారు నా బ్లాగుకు స్వాగతం. మీకు అసూయ కలిగించే కవితలు చాలా వున్నాయి అయితే. చదివి మీ అక్కసు అంతా తీర్చుకోండి.

    ప్రణు అమ్.. ఇంతకాలానికి సమయము కుదిరిందన్నమాట. మీ పేదవులపైన నవ్వు పూయించగలిగి నందుకు నా కవిత ధన్యం. పువ్వు కాయ అయ్యే దాక దాచి, పెరటిలో వెయ్యండి. కావలిసినన్ని నవ్వులు పుయ్యించొచ్చు. ఇటు వచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete