Monday, February 16, 2009

చింకి పాత

పగ్గాలెరుగని మనసు మగ్గాలు
నేసిన ఆశ వస్త్రాలు..
వాటి మీద
ఊహల రంగులల్లు కున్నాను
కోర్కెల బొమ్మ లద్దుకున్నాను

ఓసారి,
చిరిగిన కలల మబ్బులు చిందించిన
చిరుజల్లులలో తడిసి వెలవెల బోతున్నాయి
నిట్టూర్పుల వేడికి ఆరిపోతున్నాయి ...

మరోసారి,
బ్రతుకు వేగానికి ఎగిరి
జ్ఞాపకాల కంపల్లో చిక్కి చిరుగుతున్నాయి
చింకి పాతల్లా చివరికి మిగిలి పోతున్నాయి..

ఐనా
పగ్గాలు బిగవవు, మగ్గాలు ఆగవు ..
చిరిగిన మబ్బులు ఆగవు
చింకి పాతలూ ఆగవు..


==========================================


paggaalerugani manasu maggalu
nEsina aaSa vastraalu..
vaaTi miida
uuhala rangulallu kunnaanu
kOrkela bomma laddukunnaanu

Osaari,
cirigina kalala mabbulu cindincina
cirujallulalO taDisi velavela bOtunnaayi
niTTuurpula vEDiki aaripOtunnaayi ...

marOsaari,
bratuku vEgaaniki egiri
jnaapakaala kampallO cikki cirugutunnaayi
cinki paatallaa civariki migili pOtunnaayi..

ainaa
paggaalu bigavavu, maggaalu aagavu ..
cirigina mabbulu aagavu
cinki paataluu aagavu..

4 comments:

  1. బాగుంది....

    ReplyDelete
  2. Hi.. Chaala baaga raasarandi..
    Paggalerugani, manasu maggam nesina aasha vastraalu. Superb!

    ReplyDelete
  3. టణట్టణాయ్.. అపరిచితులకు స్వాగతం. వచ్చినందుకు మీకు ఎన్త ఆనందమో, మిమ్మల్ని చూసి నాకూ అంతే ఆనందంగా ఉంది. ఇలా ముసుగేసుకుని పికబూ ఆట బానేఆడారు. ముసుగు తీసి ముఖారవిందం చూపచ్చుగా ? ఇలా సస్పెన్సిలో ముంచకపోతే!! మీరు మరీ రాంగోపాల్ వర్మ సినిమాలు బాగా చూస్తారులాగుంది. ఏమైనా.. కీప్ కమింగ్. ధన్యవాదాలు.

    పద్మార్పిత గారు ధన్యవాదాలు

    మహేష్ గారు.. నా బ్లాగుకు స్వాగతం. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

    ReplyDelete