చక్కని నల్లని కన్నుల లోపల
చిక్కిన చెల్లని ఆశలు ఎన్నో
కప్పిన తలపుల మబ్బుల లోపల
చెక్కిలి తడిపిన చిక్కులు ఎన్నో
తప్పిన గుండెల చప్పుడు లోపల
డస్సిన ఆతృత కేకలు ఎన్నో
చెప్పిన నిజముల లెక్కల లోపల
ఎగిరిన చెక్కిలి తుంపర లెన్నో
వేదన మంటల వేడికి లొంగి
వెళ్ళని భావన కవితలు ఎన్నో
చచ్చినా చెరగని పచ్చల చిత్రాలై
గుండె గోడలెక్కిన మన గాధలెన్నో
వీటన్నిటికి నేనే సాక్ష్యమంటూ
వెచ్చగా కారేటి ఆశల ధారలెన్నో
ఎన్నని చెప్పను నేస్తం ? !!
నువ్వన్ని చెప్పకున్నా నీ నేస్తం ...
ReplyDeleteహొయలు ఒక పరి, వగలు తదుపరి
అన్నీ కలిసి కలల కావేరి
దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరి
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారి
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారి
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరి
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరి
వెరసి నీ
పిచ్చిది - తిరిగి తప్పిపోతే, నీకు తన వంటి గురుతులు చెపుదామని
ప్రేయసి - తను నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
ముద్ద బంతి - తన మెత్తదనం రేకుపై నువ్వద్దిన ముద్దుతో నీకు తెలుపుదామని
ముద్దరాలు - ముకుళించిన చేతుల్లో తన స్వామి రూపు ముద్రించుకుందామని
హృదయరాశి - తన ఎదలో నిను బందీ చేసి తనను విడుదల చేయను తాళం నీకే ఇద్దామని
నీ వెంటే వున్నది తథ్యం !!
నన్నయితే నూతన సంవత్సరము రాక మునుపే మీ తెలుగుదనం తో ముంచి ముద్దచేస్తున్నారు, మనసు ముచ్చటలో మురిపించేస్తున్నారు. నేను నా చిత్రములతో మాట్లాడించలేక పోతున్నాను కానీ కవితలతో మీరిరువురు నాకు అందాలు చూపిస్తున్నారు. చాలాబాగున్నాయి. అభినందనీయం..:D
ReplyDeletewww.pruthviart.blogspot.com
ధన్యురాలను పృద్వీ! ఆత్రేయగారి కలం నా కలానికిలా అలవాలం. ఇదేదో అవినాభావ కవితా సంబంధం. :)
ReplyDeleteఉషా గారు మీ స్పందన చూడటానికైనా ఇంకో కవిత రాయాలనిపిస్తుంది.
ReplyDeleteఅద్భుతంగా రాశారు. పృధ్వీ గారు మీ మురిపాలు ముగ్ధమనోహర రూపాలై మీ బ్లాగులో సాక్షాత్కరిస్తాయని ఆశ. ధన్యవాదాలు.