చెమరిన కన్నుల చిత్తడినార్పగ
చెదిరిన గుండెల ఆర్తిని తీర్చగ
వేచిన మనసుకు విడుదల నేర్పగ
కరిగిన యెడదకు కఠినత చేర్చగ
విరిగిన తలపుల పొందిక కూర్చగ
ఆర్తిగ అరిచిన గొంతును తడపగ
కర్తను నెనై చెసిన తప్పుకు
క్రుంగిన మనిషిగ చెతులు చాపగ
తపనను తీర్చగ కవితలు రెపి
కరుణను చూపే కన్నుల చూసిన
నెచ్చెలి విలువను,
ఎంతని చెప్పను నేస్తం !?
బావుంది
ReplyDeleteనువు చెప్పినవిక చాలని
ReplyDeleteనేనెంతకని చెప్పను?
నీ ప్రక్కనుంటే చాలని
నిన్నెకడని వెతకను?
కంటి చెమ్మే కవితమొలకలపై,
నువు చిలరించేటి నీటిచిలుకు.
గుండె, గొంతు ఆర్తి పోతే మిగలవింక నీకు,
నే నీకు బందీగ వస్తానంటే నువు విడుదలకు సిద్దమౌతావేం?
నీ లోకం చాపిన చేతులు, తాకేను నా లోకపు తలుపులు,
కలిసిన మనసుల భావావేశం రేపటి కలలకి స్వాగత గీతం!
కరుణ, కవిత కలిసిన కాటుకతిలకం,
సమత, మమత విరిసిన వెన్నెల పుష్పం.
"కరుణ, కవిత కలిసిన కాటుకతిలకం,
ReplyDeleteసమత, మమత విరిసిన వెన్నెల పుష్పం."
చాలా బాగా చెప్పారు ఉషా ధన్యవాదాలు. లలిత గారు ధన్యవాదాలు
Nice..You have written very well, I have written here Motivational Quotes and Hindi Shayari, Telugu Quotes and More
ReplyDelete