వద్దంటున్నా వినక జాజుల జడి వానలో
నన్ను విడిచి నువ్వు నడిచిన తరుణం
తడుపు నాకు తగిలిన వైనం
నడకాపి నాకై తిరిగి తావివై వస్తావని
కనీసం తిరిగి చూస్తావని వేచిన తరుణం
కదలని కాలమొచ్చిన వైనం
వెన్నెల పరిచిన వీధుల్లో
కదిలే చీకటి లీలల వెనక
కరిగిన గుండెలొ కదలిక కలిగి
వస్తావంటు వేచిన నాకు
మనసు ముడులు వీడి గుండె గోడలమీద
నువ్వురావన్న నిజం రుధిర ధారలై
కదిలి కవితలై కరిగి కాగితాలెక్కిన తరుణం
తపన తీరని వైనం
ఏమని చెప్పను నేస్తం ?
భ్రమకి, భ్రాంతికి, తలపుకి వారధి ప్రేమ
ReplyDeleteవూహకి, వూపిరికి, వలపుకి, సారధీ ప్రేమే
వారధి కూలాక నదిలో పయనం
సారధి వీడాక బరిలో సమరం
సాగేనా చివరివరకు?
నీవు వేచావని నిలవదు నీ నేస్తం
నువు తలిచావనీ ఆగదు క్షణం
గరళాలు గుమ్మరించిన నిజం,
కాలం గేలిచేసిన గతం, తెలుపునా
కాలాన్ని గెలిచే వైనం?
నాకంటె ముందు నువ్వెళ్ళావేమో అని
ReplyDeleteనిన్ను వెతుక్కుంటూ నడిచాను ముందుకు
కానరాలేదేమని కలత పడుతూ
పరుగులెట్టాను అంతే కాని
నిన్ను వదిలి వెళుతున్నానన్న సృహలేదు నేస్తం
నాఉనికే నువ్వైనప్పుడు
నే తావినెలా వీడగలను చెప్పు!
జాజుల anty aenti? nenu chala etarula kavitallo choosanu aa padam! pls tell me the meaning.
ReplyDeletesujana
జాజులు, సన్నజాజులు, విరజాజులు మల్లె పూవు లాంటి పూవులు. కానీ వీటి
ReplyDeleteవాసన వేరు గా ఉంటుంది.
ఇక్కడ ఈ కవితలో, నేను కురిసే మంచు వానను జాజుల వాన తొ పోల్చాను.
మంచు వానలో నన్ను వదిలి తను వెళ్ళినప్పుడు, నాకు కన్నీళ్ళు తిరిగాయి,
కాలం ఒక సారి ఘనీభవించినట్టనిపించింది. కురిసిన మంచు వీధులను
వెన్నెల పరిచిన వీదులని పోల్చాను, బాధలో అక్కడ ఘనీభవించి చీకటి దాకా
వేచి తను తిరిగి రాక, ఇక రాదని నిర్ధారించుకుని, కవిత ఒకటి వచ్చి ఉపశమనమైతే
వచ్చింది గానీ తపన తగ్గలేదు. ఈ కధ నీకు ఎలా చెప్పను అన్ని నేస్తాన్ని అదుగుతున్న వైనం ఇది.
శృతి గారు, ఉషాగారు మీ కవితా స్పందనలు అద్భుతం. ఇంకా కొనసాగిస్తారని ఆకాంక్ష.
ధన్యవాదాలు.
అయ్యో ఆత్రేయ గారూ మీ బ్లాగు లో ఇలా ఒకటి చదివితే ఒకటి ఫ్రీగా దొరుకుతుందని తెలియక ఇన్ని రోజులు ఇంత మంచి ఆఫర్ మిస్ చేసేశాను కదండీ
ReplyDeleteసమయం ఏమీ మించి పోలేదండి. మీకోసం ఆ ఆఫరు ఇంకాకొన్ని రోజులు పొడిగించడం అయినది. వచ్చినందుకు ధన్యవాదాలు
ReplyDelete