భూమి పైన అడుగిడి నప్పుడు
నింగికెగసిన మనసు తనది
అడుగులు తడబడు వసున
అందొచ్చిన వేలు తనది
మొదటి మాట పలుకు నప్పుడు
తోడయ్యిన మాట తనది
ఆరోగ్యపు గడబిడ లలొ
అదిరిపడిన గుండె తనది
గుండు సున్న మార్కులొస్తె
తపన పడిన తలపు తనది (మధన పడిన మది తనది)
మంచి మార్కులొచ్చి నప్పుడు
చాటిచెప్పిన నోరు తనది
బాధ అన్నది రాకుండగ
చెమటోడ్చిన తనువు తనది
చిన్న మాట అన్నాడని
ముఖము చాటు చేయబోకు
వయసు మళ్ళిన ముసలి వాడని
చీడ పురుగుల చూడబోకు
పనులు చేసే పటువులేదని
ఈసడించుచు కసురుకోకు
నీకు భారము అయ్యినందుకు
కుమిలిపోయే కనులు చూడు
నీకు సాయము చేయలేక
కృంగిపోయిన ఆ మనసు చూడు
కడుపు మంటను దాచుకుంటు
కంటి నీటిని మింగుకుంటు
గుండెపిండి తిండి పెట్టిన
తండ్రి కాలికి వందనం !!
chaala bagundi.
ReplyDeleteచాలా బాగుంది మీ కవిత. నేను వేసిన ఓ తండ్రి చిత్రానికి మీ కవిత వాడుకోవచ్చా?
ReplyDelete