ఆ బీటలు పడిన నుదుటి వెనక
--అనుభూతుల లోతు సాగరాలెన్నో
ఆ పన్ను లూడిన బోసి నోటి వెనక
--చెప్ప గలిగిన అనుభవ గాధలెన్నో
ఆ కండ కరిగిన తోలు చేతి వెనక
--కడతేర్చిన కటువు కార్యాలెన్నో
ఆ వంగి పోయిన వీపు నడక వెనక
--గెలిచొచ్చిన జీవిత పరుగులెన్నో
ఆ చికిలించిన లోతు కన్నుల వెనక
--చూసొచ్చిన తరతరాల గాధలెన్నో
ఆ తడబడుతున్న మాటల వెనక
--తీరని తన కోరికలెన్నో
ఆ మనిషి వెనుక బుడిబుడి నా అడుగులు
ReplyDeleteకావాలి నాకు మార్గదర్శకాలు
భావన బావుంది, చిక్కదనం అవసరం, ఒక తాదాత్మ్యతలోంచి కవిత్వం ఉబికి రావాలి, ప్రయత్నం చేయండి, మీరు ఇంకా మంచి కవిత్వం చెప్పగలరు.
ReplyDeleteఈగ హనుమాన్ (nanolu.blogspot.com)
ఉష గారు ధన్యవాదాలు.
ReplyDeleteహనీ గారు. మంచి విమర్శచేశారు ధన్యవాదాలు. తప్పకుండా ప్రయత్నిస్తాను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం రాసిన కవిత ఇది. వ్యక్తీకరణలో కాస్త పరిపక్వత ఇప్పటికి వచ్చిందనుకుంటున్నాను. నా ఇతర కవితలను చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు. మీకు మరో సారి ధన్యవాదాలు.