Wednesday, October 14, 2009

పశ్చాత్తాపం



తప్పు బరువు పెరిగి రెప్ప
తోడు చేరింది
కాళ్ళు విరిగిన ప్రేమ
కరిగి జారింది

దిశ మళ్ళిన చూపు
నేలపాలవుతూ..
గోరు గురుతును చేరి
సేదతీరింది

గుండె ఒలికిన గంగ
దొప్పల్ని నింపితే
వేడి శ్వాసల హోరు
ఆవిరిగ మార్చింది

ముడిబడిన భృకుటి
విప్పలే లేకేమో
అదిరెడి చుబుకము
పెదవి విరిచింది

నీట తేలిన జగతి
నిలువ నేర్వని స్థితి
నివురు గప్పిన ఆశ
నేటి బ్రతుకు.

7 comments:

  1. వావ్.... ఛాలా బావుంది. అద్బుత భావప్రకటన.

    ReplyDelete
  2. శీర్షికకు తగినట్టు పశ్చాత్తాపం ప్రతిఫలిస్తూ ఉందండీ చిత్రం !
    కవిత గురించి పృధ్వీ గారిమాటే నాదీనూ...

    ReplyDelete
  3. nice one atreya gaaru..
    wish u Happy n safe Deepavali :)

    ReplyDelete
  4. ప్రతి పదంలో తొణికిసలాడుతూ సజీవ భావన. ఎందుకింత నైరాశ్యం అయినా గానీ? ఎంతకాలమిలా వేదన వొలకబోస్తూ? మీకు ఆనందం పరిచయం చేయాలనుంది. కలల్లో వూహల్లో తిరుగాడటం నేర్పాలనివుంది. చనువే కానీ ఎద్దేవ కాదిది. :)

    ReplyDelete
  5. వర్మ గారు, పరిమళం గారు ధన్యవాదాలు.
    అదిత్యమాధవ్ గారు మీ శుభాకాంక్షలకు ఆలశ్యంగా ఉత్తరమిస్తున్నాను క్షమించండి. మీ ఆశీస్సులు శిరోధార్యములు. ధన్యవాదాలు.

    ఉష గారు. మీకా చనువు ఉంది. మీది ఎద్దేవా చేసే మనస్తత్వంకాదని అందరికీ తెలుసండీ. డోన్టువర్రీ.. స్వతహాగా.. నేను బాధకు స్పందించినంతగా.. ఆనందానికి స్పందించనండీ.. నా కవితల్లో నాయకుడు, సాధారణంగా.. నేను కాదు. నేను చూసిన విషయాలు, విన్నవిషయాలు, అటువంటి సందర్భాలలో, పరకాయ ప్రవేశం చేసి ఇలా స్పందిస్తూ ఉంటాను. ఎదుటి వారి బాధను పంచుకున్నంత తేలికగా వారి ఆనందాన్ని పంచుకుని స్పందించలేను. భావ వ్యక్తీకరణలో నేనింకా బాల్యదశలోనే ఉన్నానండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  6. ఆత్రేయ గారు
    "గుండె ఒలికిన గంగ
    దొప్పల్ని నింపితే
    వేడి శ్వాసల హోరు
    ఆవిరిగ మార్చింది"
    చాలా బాగుందండి.

    ఉష గారితో మీరన్నది నిజంగా నిజం బాధకి గుండె బరువెక్కుతుంది,ఆవేషం పొంగుతుంది,కవిహ్రుదయులకు ఆ ఆవేషం కలంలో సిరా అవుతుంది. ఆవేషం తగ్గాక ఈ కలం ఆగడమో,లేక కలం ఆగాకే ఆవేషం తగ్గడమో అది ఆ గుండెచప్పుడుకే(ఆ బాధ తీవ్రతకే) వదిలెయ్యాలి.
    కాని ఆనందానికి అంత తీవ్రత లేదేమొ . నాకు తెలిసినంత వరకూ నా తీరులో చెప్పాలంటే "బాధ 'ఉప్పెన ', ఆనందం 'అల '".

    ReplyDelete
  7. ఆత్రేయ గారు నేను మీ బ్లొగ్కి కొత్త ముందుగా మీకు దీపవలి శుభాకాంక్షలు....

    చాలా బాగా భాదను వ్యక్త పరిచారు ప్రతి వాక్యంలో వెదన, నిట్టూర్పులు ప్రస్పుటించాయి

    ReplyDelete