Thursday, October 22, 2009

సత్యం




దొర్లే ఆకుల గుసగుసల్లో..
కొమ్మల్లో చిక్కిన గాలి ఊసుల్లో..
కొండలు పాడే ప్రతి ధ్వనుల్లో..
కొలను చూపే ప్రతి వృత్తములో..
ఎన్ని జీవిత సత్యాలో..

తపన చాలించిన అలల్లో..
తనువు తగిలెళ్ళిన తెమ్మెరల్లో..
తేలిపోతున్న నల్ల మబ్బుల్లో..
తీరమొచ్చిన తెప్ప తనువుల్లో..
ఎన్ని జీవిత సత్యాలో..

నుదుటి కాగితం మీద
కాలం విదిల్చిన అక్షరాలను
కూర్చుకుంటూ..
గుండెలోతుల్లో..
తడవకోకటిగా చెక్కిన చిత్రాలను
సరిపోల్చుకుంటే..

ప్రతి చిత్రం... ఓ సత్యమే !!

11 comments:

  1. పొంగి పొర్లే కన్నీటి ధారల్లో
    ఉప్పోంగి వెల్లువయ్యే ఆనందభాష్పాల్లో
    నింగి నంటినా నిలవననే ఆశాశిఖరాల్లో
    నిబ్బరాన్ని సడలించే సంవేదనల్లో
    ఎన్ని జీవిత సత్యాలో
    అన్ని తరచిచూస్తే చిత్రం ప్రతీది ఆపనలవి కాని చిత్రమే
    -- మునుపటి మాదిరి చిరు స్పందనాకవిత మాత్రమే - ఉష

    ReplyDelete
  2. నుదుటి కాగితం మీద
    కాలం విదిల్చిన అక్షరాలను
    కూర్చుకుంటూ..
    గుండెలోతుల్లో..
    తడవకోకటిగా చెక్కిన చిత్రాలను
    సరిపోల్చుకుంటే..

    ప్రతి చిత్రం... ఓ సత్యమే

    జ్ఞాపకాల అనంత సత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.

    ReplyDelete
  3. ప్రతి చిత్రం... ఓ సత్యమే !!
    ప్రతి 'చిత్రం'...ఓ చిత్రమే !!

    ReplyDelete
  4. ఇంకాస్త పొడిగించి "చిత్రం" గా http://maruvam.blogspot.com/2009/10/blog-post_22.html

    ReplyDelete
  5. welcome back

    good images.

    very good meaning

    ReplyDelete
  6. experience ను పదాల్లో కూర్చారా!!! బావుంది. కానీ అక్షరాల్లోనే అనుభవసత్యాలు ఆలోచించకుండానే అగుపిస్తున్నాయి, అంతగా బాగుంది మీ భావుకత.
    Super & good one.

    ReplyDelete
  7. శ్రీ ఆత్రేయగారికి, నమస్కారములు.

    కవిత అతి సున్నితంగా మరియు అత్యంత అధ్బుతంగా వున్నది.

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  8. చిత్రాల సత్యాలు.... సత్యమైన చిత్రాలు బాగున్నాయండి..

    ReplyDelete
  9. స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

    ReplyDelete