Monday, September 7, 2009

దొరకని ప్రేమ..


చిరు దీపపు వెలుతురులు
అటు వైపూ .... ఇటు వైపూ.

తక్కెడలోని బరువులు , అవిశ్రాంతంగా..
ముల్లును కదుపుతూనే ఉన్నాయి..

రెండు విల్లులు విడిచిన
ఒకటే బాణము..
తపనలు తెలియకేమో ..
తగల కుండా .. దూసుకు పోయింది.

జారి పడ్డ ఈకలు ఏరుకుని
రంగులో ముంచి
రంగరించుకుంటున్న నాకు,

కరిగిన రాత్రి,
రెల్లు గడ్డి మీద...
చల్లగా తగిలి
మేల్కొలిపింది.

4 comments:

  1. రెండు విల్లులు విడిచిన
    ఒకటే బాణము..
    తపనలు తెలియకేమో ..
    తగల కుండా .. దూసుకు పోయింది.

    kaani mI bhaavaalu maatram sariggaanE tagilaayi..maaku...nice one.

    ReplyDelete
  2. నాకు తెలుసండి అక్టోబర్ వరకు మీ మనసాగదని, ఎందుకంటే నా స్వానుభవంలో ఒక వారం అన్న గడువు ఒక రోజుకి కుంచించుకుపోతుంది :) వద్దు అంటే నా మనసు వెల్లువై పొంగిపొర్లుతుంది.
    చక్కని చిత్రం,అంతకన్నా చిక్కని లోతైన కవిత. మీదైన బాణీ.

    ReplyDelete
  3. అద్భుతమైన భావన !
    అర్ధవంతమైన చిత్రం !
    బొమ్మగురించి మరికాస్త వివరించరూ ....
    అక్టోబర్ వరకూ తీసుకున్న సెలవుకు విరామం ఇచ్చినందుకు థాంక్స్ !

    ReplyDelete
  4. ప్రణు గారు ధన్యవాదాలు.

    నిజమే ఉష గారు. దూరంగా ఉండటం. రాయకుండా ఉండటం చాలా కష్టమే!!.

    పరిమళం గారు .. అందరికీ నేననుకున్నది అలానే అర్దంఅయ్యిందనే అనుకుంటున్నాను. వివరంఅడిగినందుకు ధన్యవాదాలు. తప్పకుండా చెపుతాను. కవిత ఆంతర్యాన్ని చెపుతాను.. చిత్రం దానంత అదే అర్ధం అవుతుంది.

    ఇద్దరు ప్రేమికులు. ఫలిస్తుందన్న ఆశ ఇద్దరిలోనూ..
    విరహము, అహము, ప్రేమ, ఆశ కాసేపు ఇటెక్కువైతే కాసేపు అటెక్కువ. ముల్లై గుచ్చుకోవడం మొదలయింది (విబేధమొచ్చింది). ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకోవలిసిన చూపులు, విరిగి చెదిరిపోయాయి. (రెండు విల్లులు.. వారి కళ్ళు.. ఒకటే బాణం.. వారి చూపులు... ) తేలికగా ఎరిగిపోగల చిన్ని చిన్ని కారణాలు బరువుగా నేల రాలాయి. వాటిని జాగర్తగా తెలుసుకుని తిరిగి బంధాన్ని తిరిగి నిర్మించాలని ఆలోచిస్తూ నిద్రకొరికిన నాకు, తలక్రింద తడిసిన (కన్నీటితో) దిండు తగిలి తిరిగి మెలుకువ అచ్చింది (ఇక్కడ నేను అని సంబోధించుకున్నది నాయకుడు... రచయిత కాదని గమనించగలరు )

    ఇప్పుడు చిత్రం చుడండి. కన్ను దాని చూపు, ఆలోచనలు, రాత్రి, విరిగి పడ్డ ఈకలు, విరిగిన హృదయం, రాత్రి, పగలు.. అన్నీ కనిపిస్తాయి.

    ReplyDelete