Wednesday, September 9, 2009

నాకింకేమీ వద్దు !


అసంకల్పితంగానే ఎంత మారాను ?
అయిష్టంగానే ఎన్ని కోల్పోయాను !!

ఆ లేత చేతులూ, నిర్మల హృదయం..
అమాయకత్వం.. ఏవీ ?

ఒద్దనుకున్న సంగమానికి
ఏమిటీ ఒరవడి ? ఎందుకీ పరుగు ?

ఆశల పగ్గాలకి చిక్కిన..
అసంతృప్తి బ్రతుకు పయనం.. ఎవరికోసం ?

ఈ ప్రస్తుతమొద్దు..
చూడని భవిష్యత్‌ వసంతాలసలొద్దు..
గతించిన గతంలోకి పున:ప్రవేశమిక వద్దు..

జనసముద్రంలో నాకై తపనతో విదికే
ఓ రెండు కళ్ళకోసం నేవేచిన
నా పసితనం చాలు..

నాకింకేమీ వద్దు !!

కౌముదిలో ఈ మాసం చిన్న మార్పులతో.. http://koumudi.net/Monthly/2009/september/index.html

6 comments:

  1. పరుగులాపి పరుగుపరుగున గుంటూరు వెళ్ళారు కదా..ఈ నలభైరోజులు

    ఆశ లేదు ఆక్రోషం లేదు
    పరుగు లేదు ప్రాకులాట లేదు
    గతం లేదు గణనం లేదు

    పసితనపు ఛాయల్లో
    సంతృప్తి జీవనంలో
    నాదైన లోకంలో
    మళ్ళీ జనిస్తా
    తిరిగి నే బాల్యమొగ్గనౌతా.

    ReplyDelete
  2. తిరిగిరాని బాల్యాన్ని అడుగుతూ ఇంకేమీ వద్దంటారే!!!

    ReplyDelete
  3. భారారే బాగా రాశా రే !! నా ఆ నలభైరోజులు ఇంకా అంతంఅవలేదండీ... ఇంతలోనే ఇటుగా పరుగెట్టుకొచ్చేశా.. :-)

    పరిమళం గారు ధన్యవాదాలండీ..

    పద్మార్పిత గారు.. ఆ బాల్యం ఇస్తే చాలు ఇంకేమీ వాద్దు అంటున్నాను. అది ఎటూ దొరకదు/రాదు అటువంటి పరిస్థితిలో అడగాల్సినవి, కోరాల్సినవి అబ్బో బోల్డు ఉన్నాయండీ.. అవన్నీ అడిగితే స్థలం చాలదని.. ఇలా.. డొంకతిరుగుడు కోరిక కోరానన్న మాట :-) ఎనీవే మంచి ప్రశ్న వేశారు.. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. దుర్గాష్టమి శుభాకాంక్షలు!!
    విజయ దశమి శుభాకాంక్షలు!!

    దసరాలు నీవే - సరదాలు నీవే
    నాకు నీవే నేస్తం- నిత్య వసంతం !

    దీపావళినీవే –తారావళి నీవే
    నా తిమిర హృదయాన-సత్యజ్యోతి నీవే

    సంక్రాంతి నీవే- ఉగాదీ నీవే
    నీవుంటె ప్రతి దినమూ- పర్వ దినమేలే

    అక్షరం నీవేలే-లక్ష్యమూ నీవేలే
    అందుకో ప్రియ నేస్తం-నా శుభాకాంక్షలివియేలే!!

    ReplyDelete
  5. రాఖీ గారు ధన్యవాదాలు. చాలా ఆలశ్యంగా చూస్తున్నాను మీ శుభాకాంక్షలు. మన్నించాలి.

    ReplyDelete