Monday, August 3, 2009

నీడ


ఎన్నాళ్ళగానో
నన్ననుసరించిన నా నీడ ...
తనకూ రంగులు కావాలనడిగింది.

కలన తప్ప రంగెరుగని నేను,
కన్న ప్రతికలనుండీ,
తను కోరిన రంగులు
రంగరిస్తూ వచ్చాను..

చాలలేదనుకుంటాను..
వెలుగు కలిసిన ప్రతి క్షణం..
అర్ధిస్తూ నిలబడుతుంది.

విధిలేక కలలూ..
నా రెప్పలు చీల్చుకుని
కాంతి తీగెలు వెదుక్కుంటున్నాయి.

వివర్ణ ప్రవాహంలో
ఎదురీదుతూ..
అలసిన గురివింద కళ్ళు..
తమ ఎరుపు మరిచి నట్టున్నాయి.

9 comments:

  1. చిత్రం అద్భుతం...
    కవిత్వం అమోఘం...

    ReplyDelete
  2. పద్మార్పిత గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బహుశా మీ అక్షరాల నీడల్లో తన జాడ వెతుక్కుందామనేమో ...ఆ చూపులకర్ధం !

    ReplyDelete
  4. ఆత్రేయ గారు, I only can concur with kottapaaLii gaaru. కలలు పంచే రంగులు అనంతం. కళ్ళు ఈదే ప్రవాహాలు సుఖాంతం. కలలు కనే కళ్ళున్న మనసుకి విజయం కైవల్యం. ఆ మనసున్న మనిషి అంటే మీ జీవితం సఫలం. మీరు/మీవంటి కవులు న్న ఈ లోకాన మేము సంతృప్తులం. బాగా హత్తుకునే భావన. ఆ గాఢత తగ్గటానికే అలా చమత్కరించాను. మరోలా అనుకోకండేం..

    ReplyDelete
  5. "కలన తప్ప రంగెరుగని నేను,
    కన్న ప్రతికలనుండీ,
    తను కోరిన రంగులు
    రంగరిస్తూ వచ్చాను.."

    చాలా బాగా రాశారు.

    మీ తోడున్న నీడకు కంటిలో ఎరుపెలాస్తుంది? చల్లని చూపు తప్ప :)

    ReplyDelete
  6. కొత్త పాళీ గారూ ధన్యవాదాలండీ. నారాతలు చాలా మటుకు ఎమోషనల్. వచ్చిన భావాలు వచ్చినట్టుగా కాగితమెక్కుతాయి. కొన్ని ఆలోచనతో కూడుకున్నవి.. ఇలాంటివి మనసులో కొంతకాలం నలిగి, మధనపడి, పెట్టి కాగితమెక్కుతాయి. ఇది అలాంటి వాటిలో ఒకటి. మీ ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు.

    పరిమళం గారూ మీరా చూపులకిచ్చిన భాష్యం చాలా బాగుంది. నిజమేనేమో అనిపించేలా..

    ఉషా గారూ మీ చెణుకు బాగుంది. మీరు కామెంటేసినా కవితలానే ఉంటుంది. అంతా మీరుంటున్న స్థల మహిమ అనుకుంటాను. నాకో ఇల్లు రెంటుకు చూసిపెట్టరూ.. ఇలా మనసు కవితలు మాని కేరింతలు కొట్టించే కవితలు రాస్తాను.. :-).

    విశ్వప్రేమికుడుగారూ.. మీకుకూడా ఆనీడచూపుల్లోని చల్లదనమే కనిపించిందన్న మాట. పరిమళంగారి లాగా.. గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ అని సామెత. నెనరులు.

    ReplyDelete
  7. ఆత్రేయ గారు, మా ఇల్లే తీసేసుకోండి అంతగా అడగాలా ఏమి ;)

    ReplyDelete
  8. మీ నీడకు కవితతో రంగులద్దిన తీరు ముచ్చటగా ఉంది

    ReplyDelete