Tuesday, July 28, 2009

కవితా శకలం


చూపులు కలిసిన ప్రతిసారీ
పెగలని పదాలు
పెదవుల మాటునే
కరిగిపోతున్నాయి..
పువ్వులు పూస్తున్నాయి..

జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి..

నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !

నిప్పును మ్రింగి
వెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...

నీక్కావల్సినదానిని
మరో సారి చెప్పనీ..
నేను నిన్ను మరచాను !!

నిజమే.. నిన్ను నేను మరచాను..
కానీ... నువ్వే !!.... ప్రతిక్షణం..
ప్రతిఒక్క క్షణం.. గుర్తొస్తున్నావు ..

కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో !!

12 comments:

  1. నిను మరవనా, నిను వీడిపోనా అని అడగలేక ఓ 10 సెకల్న క్రితం వ్రాసుకున్న నా వేదనాకవిత "నే వెళ్ళాలిక పరాధీన జీవితరేఖ వెంట" http://maruvam.blogspot.com/2009/07/blog-post_28.html

    ఆశగా మీ కవితలో వెదికాను మరో దారుందా అని. అందరిదీ ఒకటే దారి - వేదన పరిచిన కన్నిటి ముళ్ళ బాట :( అవునండి కన్నిరినికిపోతుంది అంటారు మీకేమైనా తెలుసా నా కనులెదుకు వూట బావులో. మీ కవిత చదివి మరిన్ని, చూపు కప్పేస్తూ..

    ReplyDelete
  2. బాబ్బాబు, అలా ఎలా గుర్తు వస్తారో కొద్దిగ్గ చెబుదురూ.. రోజూ గుర్తువస్తే నేను కూడా రోజూ ఓ కవితా శకలాన్ని వ్రాసుకుంటాను. వీలైతే గంట గంటకూ గుర్తొచ్చే చిట్కా వున్నా నాకు ఓకె.

    ReplyDelete
  3. ప్రేమించి పోగొట్టుకో
    పోగొట్టుకునీ
    ప్రేమిస్తూనే ఉండు
    గంటకొకటేం ఖర్మ
    ప్రతి సేకనూ శకలమవుతూ
    మృత్యుకేక పెడుతూనే
    కవితా కన్యకను ప్రసవిస్తుంది.

    ReplyDelete
  4. నిప్పును మ్రింగి
    వెన్నెల కురిపించే
    ఆ చందమామదీ
    ఇదే కధేమో ...
    అద్భుత పదచిత్రన. చాలా బాగుందండి...

    ReplyDelete
  5. నాది అదృష్టమే!
    మృష్టాన్నాలు కాదు కాని
    ముష్టన్నమైనా దొరికింది
    తన నిజాయితీ
    నాకు ప్రాణం పోసింది
    నువ్వు మరువలేవు
    నీకు మారగరాదు
    వృధా ప్రయాసెందుకు
    రోజూ ఇంటికిరా
    మెతుకులు విదిలిస్తానంది
    అహమొదిలేసా
    భిక్షలో బతుకేస్తున్నా
    భిక్షల మధ్యో?......
    ముసుగేసుకు
    బతుకుతున్నా!

    ReplyDelete
  6. ఆక్షేపణా స్వరం అధికమయింది
    అసంకల్పితంగా తప్పు జరిగింది. భారారే గారు ..సారి:-)

    ReplyDelete
  7. ఉష గారు నిజమే కన్నీరు ఇంకిపోతుంది అన్నారు.. ఊటభావి ఎండిపోతుందనలేదుగా.. :-) పెరిగే వయసు మరుపు మట్టి వెస్తూనే ఉంటుంది.. జ్ఞాపకాలు పూడిక తీస్తూనే ఉంటాయి.. నలిగిన మనసు ఇలా కాగితాలమీదకి ఉరుకుతూనే ఉంటుంది.

    భారారె గారు. గుండె చివుక్కుమండానికి కూడా చిట్కాలడుగుతున్నారంటే.. మీరెంత సంతోషంగా ఉన్నారో.. అంతకంటే కావల్సినదేముందండీ.. గుడ్‌ ఫర్‌ యు.

    ఒప్రేపి గారూ.. ప్రేమించి పోగొట్టుకోకపోయినా.. కవితలు వస్తాయి. కవితా కన్య ప్రసవం తరవాతి ఆనందా స్రువులు మరిచినట్టున్నారు. ప్రేమ బిక్ష అనుకుని వ్యధ పడటంకన్నా.. దొరికిందే వరమనుకున్నా.. కవితలకు కొదవ ఉండదు. మీ కవితలను చూడాలని ఉంది.. మీ బ్లాగును మాకు తెరవచ్చుకదా ... ? మీ ఆక్షేపణను భారారె గారు గుండెకెత్తుకోరని నా నమ్మకం. నాకవితలోని నిరాశను తేలిక చేయడానికి అది ఆయన సహృదయంతో వేసిన చెమక్కని నా నమ్మకం. సారీ చెప్పి మనసు చిన్న బుచ్చుకోవద్దని మనవి. ఇలా ప్రతిస్పందనలతో నా కవితలను ధన్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

    వర్మ గారు ధన్యవాదాలండీ..

    ReplyDelete
  8. Kavitha sakalam.
    PEruloney undi poesy antha. Meedi spandichey hrudayam andi.

    ReplyDelete
  9. ధన్యవాదాలు త్రినాధ్ గారు.

    ReplyDelete
  10. ఆత్రేయ గారు,
    ఆ బ్లాగు మా సంబంధం ప్రతి మజిలీ చూపించే అద్దం, అది పబ్లిక్క్ చెయ్యగలిగే ధైర్యం వచ్చినప్పుడు మొదటగా మిమ్మల్నే ఆహ్వానిస్తాను. సారి.

    ReplyDelete
  11. ఎంత సరళంగా ...మరింత హృద్యంగా రాశారు గురువుగారూ !

    ReplyDelete