Friday, July 24, 2009

నాకూ మరణం కావాలి !!


మెరిపించిన కనులను
పెదవి విరుపులు
మరుగుచేస్తున్నాయి..
ఐనా.. ఈ తావు వీడలేను


నేను..
నిశీధిలో కలిసిన
మూగ నవ్వును ..
తడి స్పర్శ తెలియని
తపన జీవిని ..
ఏ గంధమూ లేని
మనసుగంధాన్ని..

రాలిన ప్రతి పువ్వూ
విధి విదిల్చిన రంగువే
అంటూ దెప్పుతుంది.
చివుక్కుమన్న ప్రాణం
చిన్నబోతుంది.

మంచు ముత్యాలూ
తేనెటీగలూ
కొప్పు శిఖరాలూ
కోవెల మెట్లూ
అన్నీ నా కలల ప్రపంచంలో ..
కరగని కధలే..

అలంకారానికీ కొరగాక
ఆనందాలకూ పనికిరాక
చావుకీ దూరంగా
ఎందుకీ బ్రతుకు? ఎవరికోసం.

ఆ నవ్వు.. ఆ స్పర్శ..
ఆ మమత.. ఆ ఆనందం..
నాకూ కావాలి.

మరుజన్మ కైనా.. కానీ
ప్స్చ్‌ .. మరణమూ రాదుగా.
కాగితం పువ్వును నేను..
ఈ బ్రతుకింతే !!

త్రినాధ్ గారు తన బ్లాగులో ఆంగ్లంలో రాసిన కవిత నుండి స్పందన పొంది రాసిన కవిత ఇది. ఆకవితను ఇక్కడ http://musingsbytrinath.blogspot.com/2007/12/paper-flower-suggested-by-prashanth.html

18 comments:

  1. ఆత్రేయగారూ ఈ సారి మీ వంతు.

    మూసిన కన్నులైనా
    విరిగిన హృదయమైనా
    నా రంగు చూడగ చలించాల్సిందే

    తడిస్పర్శ లేకున్నా
    సుగంధ పరిమళాలు లేకున్నా
    ఏ రంగు సాటి నా మేని రంగుకు?

    రాలి పడ్డ నా రంగు చూసి
    మనసు పడే చూపులెన్నో.

    మంచు ముత్యాలు,తేనెటీగలు
    తెలుపు నలుపుల బోసి వర్ణాలు.
    కొప్పుసిఖారనిది కోవెల దేవునిదీ
    కలనైనా మారునా ప్రభాతవర్ణంగా?

    ఈ హాయి - ఈ వర్ణం
    ఈ మమత - ఈ వెలుగు

    మరుజన్మలో నైనా కానీ
    ఆహా.. చాలు నాకీ భాగ్యం
    కాగితం పువ్వును నేను
    రాణి లాంటి దాన్ని.

    ReplyDelete
  2. మీకు కొత్తిల్లు అచ్చొచ్చినట్టుంది.. కవితలు తన్నుకొస్తున్నాయి.. బాగుంది మీ కవిత. నాకవితను అద్దంలో చూసినట్టుంది.

    ReplyDelete
  3. అవును ఆత్రేయగారూ, కాగితం పూలు ఎర్రగా వుంటాయి కదా? బొమ్మలో వుండే పూలు కూడా కాగితం పూలేనా?

    ReplyDelete
  4. భారారె గారు. కాగితం పూలు అంటే.. ఆ కాగితం పూల చెట్టుకాదు. కాగితంతో చేసిన పూలు paper flowers అన్న మాట. ఇక పోతే బొమ్మ... మన కాగితం పువ్వు కన్నీళ్ళలోనుండి .. అది చూస్తున్న ఓ నిజమైన పువ్వు. అందంగా సున్నితంగా సుగంధ భరితమై ప్రాణం కలిగిన పువ్వు (అందుకే నాలుగు చుక్కల్లో నుంచి నాలుగు రకాలుగా దానికి కనబడుతుంది) .. కవి హృదయం.. అంటే ఇదే మరి. :-)

    ReplyDelete
  5. పుట్టకనే ఎదిగిన మొగ్గ
    సమాజం చెక్కిన నాకు మల్లే
    విచ్చకనే అరవిరిసిన పూవు
    సంసారంలో నావగ మారిన నాకు మల్లే
    చూపులకి గేలం వేసే సౌందర్యం
    పరుల చూపులకి వెరసే నాకు మల్లే
    అసహజాన్ని వలదన్న ఆ పుష్పం
    మరణాన్ని కోరుకునే నాకు మల్లే
    అద్దంలో నాకిపుడు అనామిక కానరాదు
    నేను తనకు మల్లే ఓ కాగితం పూవు

    *** నాది కాని నైజాన్ని మోసే క్షణాల్లో నా మనస్థితిది. సంబంధం లేకపోయినా మీ కవితతో వెలికి వచ్చింది.

    ReplyDelete
  6. ఆత్రేయగారూ..కాగితంతో చేసే పూలా.. అస్లెప్పుడూ చూడలెదే... గుడ్

    ReplyDelete
  7. ఆత్రేయ గారికి, నమస్కారములు.

    మీ కవితపై నా వ్యాఖ్య ఒక్క చరణంలో చెప్పాలంటే: మీ కవితకు, ఆ కాగితపు పువ్వు భావనలకు " పునఃజన్మ " లేకుండగాక!!

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  8. mee kavita ku,,,kagitapu puvvu vikasinchi virabuyalani ahsalu vunnayi ani ati sunnitanga chepparu,,,ee kavitani ee konamlo nundi chusina aa bhavaaniki taggattuga vundi

    naku anipinchindi chebutunnanu,,,pujaku paniki rani puvvu cinima gurtukochindi ,,,usha kiram movies varidi,,veshya patra samjalo ee vidhanga vuntundo ani chepparu aa cinimalo

    meeku abhinandanalu andi

    ReplyDelete
  9. సృష్టింపబడింది ఏదయినా దేనికదే ప్రత్యేకత కలిగివుంటుంది. దానిని మనం గౌరవించాల్సిందే. మీ భావన అలోచనాత్మకం.

    ReplyDelete
  10. భారారె గారు ధన్యవాదాలు.

    నెలబాలుడు గారు నెనరులు.

    మాధవరావు గారు అస్తు. ధన్యవాదాలు.

    అంజు గారు నాబ్లాగుకు స్వాగతం కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    వర్మ గారు నిజమే దేని ప్రత్యేకత దానిదే, మనమయినా అంతే.. అది మరిచి/చాలక ఏదో కావాలని ప్రతివారికీ ఓ అసంతృప్తి.. అధి సాధించాలన్న తపన. తీరనప్పుడు దు:ఖము.. జీవిత సత్యాలివి. ధన్యవాదాలు.

    ఉష గారు మంచి స్పందన రాశారు. సంబంధం లేకపోయినా అన్నారు.. ఆమాట అర్ధంకాలేదు.. :-)

    త్రినాధ్ గారు మీరు చాలా కాలంక్రితం రాసిన ఓ కవితను చదివినప్పటినుంచి.. నాకు ఇది రాయాలని ఉంది. అప్పట్లో మీరు రాసిన దానికి అనువాదం రాయాలని ప్రయత్నించాను కుదరలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా బయటకు వచ్చింది. నా ఈ కవితకు ప్రాణం పోసినది, స్పందింప చేసింది.. మీ కవితే.. మళ్ళీ మీ బ్లాగులోకి వచ్చి ఆ కవిత లింకును గ్రహించి ఇక్కడ ఉంచుతాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  11. ఒహో ..మహామహుల కవితల పండుగ ! కన్నుల పండుగ !

    ReplyDelete
  12. పరిమళం గారు ధన్యవాదాలన్డీ.

    ReplyDelete
  13. Aatreya gAru,
    ee telugu kavita chAlA bAgA kudirindi. nAku chAlA nacchindi. asalu aa english lo rasinadani title/theme oka tamil novel peru. kAgitapU Poogai ani. Evaro oka tamil friend aa padam ichi rayamannadu okappudu. malli nA kavithalanunchi oka rachana ravadam, nAku chala santoshamga undi. mE telugu rachanalu choosi nenoo telugulo blog start chesanu appudappudu post chestunnanu akkada, at anuvadam.blogspot.com . untanu mari.
    Trinath

    ReplyDelete
  14. త్రినాధ్ గారు ధన్యవాదాలు. ఆ బ్లాగు అనువాదం అనుకున్నాను. ఇప్పుడే అటువెళ్ళాను. అణువాదం అని తెలుసుకున్నాను. ఇక తరుచు చూస్తాను.

    ReplyDelete
  15. telu kavita vindu to nakannulaku pandagaindi...www.kavitaahalahalam.blogspot.com

    ReplyDelete