Tuesday, July 28, 2009
కవితా శకలం
చూపులు కలిసిన ప్రతిసారీ
పెగలని పదాలు
పెదవుల మాటునే
కరిగిపోతున్నాయి..
పువ్వులు పూస్తున్నాయి..
జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి..
నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !
నిప్పును మ్రింగి
వెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...
నీక్కావల్సినదానిని
మరో సారి చెప్పనీ..
నేను నిన్ను మరచాను !!
నిజమే.. నిన్ను నేను మరచాను..
కానీ... నువ్వే !!.... ప్రతిక్షణం..
ప్రతిఒక్క క్షణం.. గుర్తొస్తున్నావు ..
కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో !!
Subscribe to:
Post Comments (Atom)
నిను మరవనా, నిను వీడిపోనా అని అడగలేక ఓ 10 సెకల్న క్రితం వ్రాసుకున్న నా వేదనాకవిత "నే వెళ్ళాలిక పరాధీన జీవితరేఖ వెంట" http://maruvam.blogspot.com/2009/07/blog-post_28.html
ReplyDeleteఆశగా మీ కవితలో వెదికాను మరో దారుందా అని. అందరిదీ ఒకటే దారి - వేదన పరిచిన కన్నిటి ముళ్ళ బాట :( అవునండి కన్నిరినికిపోతుంది అంటారు మీకేమైనా తెలుసా నా కనులెదుకు వూట బావులో. మీ కవిత చదివి మరిన్ని, చూపు కప్పేస్తూ..
బాబ్బాబు, అలా ఎలా గుర్తు వస్తారో కొద్దిగ్గ చెబుదురూ.. రోజూ గుర్తువస్తే నేను కూడా రోజూ ఓ కవితా శకలాన్ని వ్రాసుకుంటాను. వీలైతే గంట గంటకూ గుర్తొచ్చే చిట్కా వున్నా నాకు ఓకె.
ReplyDeleteప్రేమించి పోగొట్టుకో
ReplyDeleteపోగొట్టుకునీ
ప్రేమిస్తూనే ఉండు
గంటకొకటేం ఖర్మ
ప్రతి సేకనూ శకలమవుతూ
మృత్యుకేక పెడుతూనే
కవితా కన్యకను ప్రసవిస్తుంది.
నిప్పును మ్రింగి
ReplyDeleteవెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...
అద్భుత పదచిత్రన. చాలా బాగుందండి...
This comment has been removed by the author.
ReplyDeleteనాది అదృష్టమే!
ReplyDeleteమృష్టాన్నాలు కాదు కాని
ముష్టన్నమైనా దొరికింది
తన నిజాయితీ
నాకు ప్రాణం పోసింది
నువ్వు మరువలేవు
నీకు మారగరాదు
వృధా ప్రయాసెందుకు
రోజూ ఇంటికిరా
మెతుకులు విదిలిస్తానంది
అహమొదిలేసా
భిక్షలో బతుకేస్తున్నా
భిక్షల మధ్యో?......
ముసుగేసుకు
బతుకుతున్నా!
ఆక్షేపణా స్వరం అధికమయింది
ReplyDeleteఅసంకల్పితంగా తప్పు జరిగింది. భారారే గారు ..సారి:-)
ఉష గారు నిజమే కన్నీరు ఇంకిపోతుంది అన్నారు.. ఊటభావి ఎండిపోతుందనలేదుగా.. :-) పెరిగే వయసు మరుపు మట్టి వెస్తూనే ఉంటుంది.. జ్ఞాపకాలు పూడిక తీస్తూనే ఉంటాయి.. నలిగిన మనసు ఇలా కాగితాలమీదకి ఉరుకుతూనే ఉంటుంది.
ReplyDeleteభారారె గారు. గుండె చివుక్కుమండానికి కూడా చిట్కాలడుగుతున్నారంటే.. మీరెంత సంతోషంగా ఉన్నారో.. అంతకంటే కావల్సినదేముందండీ.. గుడ్ ఫర్ యు.
ఒప్రేపి గారూ.. ప్రేమించి పోగొట్టుకోకపోయినా.. కవితలు వస్తాయి. కవితా కన్య ప్రసవం తరవాతి ఆనందా స్రువులు మరిచినట్టున్నారు. ప్రేమ బిక్ష అనుకుని వ్యధ పడటంకన్నా.. దొరికిందే వరమనుకున్నా.. కవితలకు కొదవ ఉండదు. మీ కవితలను చూడాలని ఉంది.. మీ బ్లాగును మాకు తెరవచ్చుకదా ... ? మీ ఆక్షేపణను భారారె గారు గుండెకెత్తుకోరని నా నమ్మకం. నాకవితలోని నిరాశను తేలిక చేయడానికి అది ఆయన సహృదయంతో వేసిన చెమక్కని నా నమ్మకం. సారీ చెప్పి మనసు చిన్న బుచ్చుకోవద్దని మనవి. ఇలా ప్రతిస్పందనలతో నా కవితలను ధన్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
వర్మ గారు ధన్యవాదాలండీ..
Kavitha sakalam.
ReplyDeletePEruloney undi poesy antha. Meedi spandichey hrudayam andi.
ధన్యవాదాలు త్రినాధ్ గారు.
ReplyDeleteఆత్రేయ గారు,
ReplyDeleteఆ బ్లాగు మా సంబంధం ప్రతి మజిలీ చూపించే అద్దం, అది పబ్లిక్క్ చెయ్యగలిగే ధైర్యం వచ్చినప్పుడు మొదటగా మిమ్మల్నే ఆహ్వానిస్తాను. సారి.
ఎంత సరళంగా ...మరింత హృద్యంగా రాశారు గురువుగారూ !
ReplyDelete