గుండె తూట్లు పొడిచి
మెడలో సూత్రాన్ని కట్టాను
తాడు ఒడిసి పట్టి
ఎదురు గాలికి ఎదురీదమన్నాను
నిలవడంకోసం,
తనను నిలపడం కోసం
బాధ్యతలను తగిలించాను
దిక్కులు చూస్తూ విలవిలలాడే
తనని చూస్తూ మురుస్తున్నాను..
మనసు ఫణంగా పెట్టి మిన్నకుంది.
ఇది నా కర్కశత్వమా?
తన నిర్ద్వందత్వమా ?
ఆ పటానికే తెలియాలి.
భార్య అనుకొన్నాను.గాలిపటమా? లేక భార్యేనా? ఇద్దరూ ఒకటేనా?
ReplyDeleteభార్య ఎగిరే గాలిపటమా? భర్త సూత్రధారా? ఆలోచనలను రేకెత్తించింది మీకవిత.
ఈ మధ్య మా మెదడుకు పదును పెడుతున్నారు గురువుగారు !గాలిపటమే అనుకుంటున్నా !
ReplyDeleteగాలిపటానికి మనసును తగిలి౦చి ఎన్ని ఊసులు పలికి౦చారూ, భలేవారే ఆత్రేయ గారు!
ReplyDeleteమనుషుల బ్రతుకు చిత్రాలు గాలి పటంతో పోలుస్తున్నారా?
ReplyDeleteగాలి పటమే !!
ReplyDeleteజయచంద్ర గారు, పరిమళం గారు, ఆనంద్ గారు, వంశీ గారు ధన్యవాదాలు.