కొమ్మలొదిలిన అల్లిబిల్లి ఊసులు
తనని చేరేలోపు ఒలికిన వయ్యారాలు,
చల్లని చెంపమీద, ఊరించి ఊరించి
తుమ్మెద, చటుక్కున ముద్దెడుతుంది
దొర్లిన సిగ్గు దొంతరలు..
మర్రి చేతుల కితకితలకు అలలు అలలుగ
రేగిన పులకింతలు..
ఎందరి ప్రేమ గెలుచుకుందో
నింగి కప్పుకుని నిండుగా.. నిలిచింది..
నన్ను చూస్తూ.. కరుగుతున్న
నా కాలాన్నీ కలుపుకుంటూ..
మా గోదావరి ఒడ్డున గడిపిన ఒంటరి క్షణాలు గుర్తొచ్చాయిలే... బావుంది. కాని ఈ భావుకతని ఇంత చిన్న కవితలో ముగించేయడం ఏమి బాలేదు.
ReplyDeleteకాలాన్ని.. ఇలానే గడపాలి.. అనే నా భావానికి...మీరు ఒక.. అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చారు....
ReplyDeleteఊహించండి... ప్రకృతిలో ... అదరం .. చిన్న పిల్లలమై పోతాము.. హ హ హ ..
ధన్యవాదాలు...
శివ చెరువు
వంశీ గారు, శివ గారు మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteఆత్రేయ గారూ , కవిత బావుందండీ !
ReplyDelete@ kRsNa గారూ ! గోదావరి మీదేకాదు మాదికూడానండీ :)
ఆత్రేయగారికి, నమస్కారములు.
ReplyDelete"చెరువుగట్టు" మీద కూర్చొని, మీరు తూట్లు పొడిచిన ఆ "గాలి పటాన్ని" చూస్తూ, "తొలి ఝాములోనే" ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారో అని ఆలోచనలో పడిపోయిన నేను కూడా మీ ఒక "సహజన్మినే". మీ కవితలెన్నెన్నో నా మదిలో "పునరావృత" మవుతుంటాయి. మీ కవితాభావలు నాకు "అర్ధా"లవుతున్నాయి. మరిన్ని చక్కటి కవితలకు "జడలల్లాలని" ఆశిస్తూ, హృదయపూర్వక అభినందనలతో,
భవదీయుడు,
మాధవరావ్.
గమనిక:- నా బ్లాగ్ "మీతొ చెప్పాలనుకున్నా" ను చదివి, నా కవితలపై, మీ అభిప్రాయాలని తెలియచేయమని కోరుతున్నాను. బ్లాగ్ : "మాధవరావు్‌పబ్బరాజు.వర్డ్‌ప్రెస్స్.కాం"
చెరువు గట్టు, వూరి మొగలు, మామిడి తోట ఇలా కొన్ని ఎంతకాలమైనా, ఎంత దూరమేగినా మధురోహల్ని తిరిగి తోడిపోస్తూనే వుంటాయి మీ కవితల్లో ఈ మధ్య తరుచుగా వునికి చూపుతున్న మఱ్ఱిచెట్టు సాక్షిగా.
ReplyDeleteమాధవరావ్ గారూ మీ అభిమానానికి శత కోటి వందనాలు. మీ బ్లాగుకు వెళ్ళలేక పోయాను. దయచేసి మరో సారి లింకును ఆగ్లంలో చెప్పగలరు.
ReplyDeleteఉషగారు నిజమేనండి పాత జ్నాపకాలు అలా మనతో దొంగాపోలీసు ఆట ఆడుతూనే ఉంటాయి.. ధన్యవాదాలు.
పరిమళం గారు ధన్యవాదాలు.
Sree Aatreyagaariki, Namaskaaramulu. As desired by you, I am giving,hereunder, my Telugu Blog address:
ReplyDeletehttp://madhavaraopabbaraju.wordpress.com/
godavari takanu mee kavitha dwara
ReplyDelete