Saturday, April 25, 2009

తొలి ఝాము


నిన్న దాచిన రంగుల చిత్రాన్ని
రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది

మబ్బుల మగ్గాన్ని దూరాన ..
మిణుగురు దండు తరుముతోంది

పక్షి గుంపులు ఆకాశంలో
అక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి

పొగమంచు తెరలు తీసి ఉదయం
చెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది

జోడెద్దులు గంటల శబ్దంతో
వాటి అడుగులు కలుపుతున్నాయి

కొమ్మ సందుల్లోనుంచి కిరణాలు
గడ్డిమీద పచ్చరంగు పులుముతున్నాయి

9 comments:

  1. ఆత్రేయ గారూ, జోడెద్దులు గంటల శబ్దంతో ఉదయానికి సరికొత్త స౦గీతాన్ని జోడి౦చారు. మీ కవితతో తూర్పు ప్రభలకు స్వాగత గీతాన్ని పాడారు. చాలా బాగు౦ది.

    ReplyDelete
  2. Dear poet!
    excellent expressions, keep it up.
    Ega Hanuman, nanolu.blogspot.com

    ReplyDelete
  3. ఉషోదయమైంది మా హృదయం లో .........beautiful!

    ReplyDelete
  4. కవిత నచ్చి స్పందించినందుకు అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  5. బాగుంది. చాలా చక్కగా ఉంది కవిత. :) -విజయ్

    ReplyDelete
  6. ధన్యవాదాలు విజయ్ గారు.

    ReplyDelete
  7. eerOju chala early ga lechaanu. udayabhaanudu leta kiraNAlu sunnintanga tAkutunTE mee kavita gurtochi malli chaduvAnu. abhinandanalu. :)

    ReplyDelete