Friday, April 24, 2009

నీ సహజన్మి !


కవలలం ..నిజమే.. కలిసి
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
ఊహతెలిసే కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
నా మానాన నన్నొదిలేశావు..

స్థితిగతులు మారి, నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.

నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...

నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?

నీ రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?

విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. !

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
నీ సహజన్మి !

ఈ కవిత ఆవకాయ.కాం లో పంచుకున్నది.
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=1513&pageNo=౦

9 comments:

  1. నిద్రో , మృత్యువో ....మరొకటో .....వివరంగా చెప్పరూ !

    ReplyDelete
  2. అటువంటి అనుమానాలకి ఎక్కడా అవకాశమివ్వలేదే ?... మరోసారి చూడండి..

    ReplyDelete
  3. ఇంత నిగూఢత ఉన్న కవితలకి మాబోటి చిన్నవాళ్ళు ఎమని కామెంటాలి... ఏదేమైనా బావుంది. ఇంక మీ శిష్యులు ఏమంటారో చూడాలి.

    ReplyDelete
  4. క్రిష్ణ గారూ
    మృత్యువేనేమో!

    ReplyDelete
  5. ఆత్రేయ గారు ఒక్కక్క సారి కవిత ఎంత బాగున్నా, మనసు ఏదోలా అవుతుంది.

    ఇంతకంటే ఏమి వ్యాఖ్య వ్రాయను?

    ReplyDelete
  6. వంశీ .. ఈ కవిత, .. ఓ అజ్నాత గురించి.. ఓ దరిచేరని దాని/వాని గురించి, . ఏదో అసంతృప్తి.. అనిర్వచనీయమయిన ఆందోళన.. గురించి.. అందుకని అలా .. ఏదో/ఎవరో ఉందని/ఉన్నారని తెలుసు.. కానీ తెలియదు..రారు..అందుకే.. చెప్పాల్సిన విషయాన్ని తెరలవెనక దాచే అదే సందిఘ్దత, ఉత్కన్ఠ లను రేకెత్తించే .. ప్రయత్నం... కొంత జరిగింది, కొంత జరగలా..మరది విషయం... :-(

    బాబా గారూ మీకూ అనుమానమే :-( !!

    భాస్కర రామె రెడ్డి గారు.. మీ మనసు ఏదోలా అయితే.. నిజంగా.. ఈ కవిత తనపని తను చేసినట్లే.. ఇంతకీ మీరూ మృత్యువేనంటారా ?...

    ReplyDelete
  7. మిత్రమా
    నా అనుమానం ఈ వాక్యాల వలన. మరీ ముఖ్యంగా రెండో వాక్యం.
    అందుకే ఎందుకైనా మంచిదని ఏమో అంటూ కామెంటాను. :-)


    విధిని నమ్మిన వాడిని
    నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు

    కాలం జారుతుందిగా..
    మన మధ్య దూరమూ..కరుగుతుంది. !

    ఇప్పటికీ, మీ వివరణ కన్నా నా ఊహే నాకు అందంగా ఉందంటే కోపగించుకోరుగా?

    ReplyDelete
  8. బాబా గారు.. నేను రాసింది మృత్యువు గురించే.. ఈ విషయాన్ని వంశీగారి ప్రశ్నకు సమాధానంగ IM లో ఆయనకు సమాధానం చెప్పిన తరవాతే ఆయన ఇక్కడ కామెంటారు. అది మృత్యువేమో అని మీరనే సరికి, మీకూ అనుమానమేనా అన్నాను. మీరు చాలా బాగా నే ఊహించారు. నాకుగా నేను, అది మృత్యువు అని చెప్పడం ఇష్టంలేక.. అలా డొంకతిరుగుడు వివరణ ఇచ్చాను .. ఆ వివరణాకూడా మృత్యువు గురించే.. అభినందనలు. + ధన్యవాదాలు బాబా గారూ..

    ReplyDelete